
సొంతగడ్డపై భారత్ చాలా బలమైన జట్టు
భారత్‌లో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు పెద్ద సవాల్ ఎదురు కానుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
భారత్‌లో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు పెద్ద సవాల్ ఎదురు కానుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. టెస్టులతో పోలిస్తే వన్డేల్లో పిచ్‌లు కాస్త మెరుగ్గా ఉంటాయి కాబట్టి హోరాహోరీ పోరు సాగవచ్చన్న క్లార్క్... సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువు కాదని అన్నాడు.
కోహ్లి నాయకత్వంలో అన్ని రంగాల్లో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోందని చెప్పాడు. అశ్విన్‌లో అపార ప్రతిభ ఉంది కాబట్టి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లో కూడా రాణించగలడని క్లార్క్ అన్నాడు.