
35 అయినా 20లో ఉన్నట్టుంది..
హాంకాంగ్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ చివరి అంతర్జాతీయ టి-20 మ్యాచ్ ఆడి దాదాపు ఆరేళ్లు కావస్తోంది. గత తొమ్మిది నెలల నుంచి క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అయితే 35 ఏళ్ల క్లార్క్ 20 ఏళ్ల నవ యువకుడిలా భావిస్తున్నాడు. హాంకాంగ్ టి-20 బ్లిట్జ్లో ఆడేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
'నా వయసు కంటే 15 ఏళ్లు చిన్నవాడిలా భావిస్తున్నా. ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లయినా, 20వ ఏట ఉన్నట్టుంది' అని క్లార్క్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్లార్క్ తన కెరీర్లో 115 టెస్టులు, 245 వన్డేలు, 34 అంతర్జాతీయ టి-20లు ఆడాడు. కాగా ఇటీవల క్లార్క్ ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్తో పాటు హాంకాంగ్ ఈవెంట్లో ఆడనున్నాడు.