
క్లార్క్‌కు చోటు
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ప్రకటన
అడిలైడ్: భారత్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సెలక్టర్లు 12 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా మైకేల్ క్లార్క్‌కు ఇందులో అవకాశం కల్పించారు.అయితే బుధవారం లోగా అతను ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టులో స్థానం ఖరారవుతుంది.
షేన్ వాట్సన్, ర్యాన్ హారిస్‌లకు కూడా టీమ్‌లో చోటు లభించింది. మోకాలి ఆపరేషన్ తర్వాత హారిస్ మళ్లీ టీమ్‌లోకి వస్తుండగా... యువ పేసర్ జోష్ హాజల్‌వుడ్‌కు తొలిసారి అవకాశం కల్పించారు. మరో వైపు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్‌లు జట్టులో స్థానం కోల్పోయారు. వచ్చే నెల 4నుంచి బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు జరుగుతుంది.
జట్టు వివరాలు: మైకేల్ క్లార్క్ (కెప్టెన్), వార్నర్, రోజర్స్, వాట్సన్, స్మిత్, హాడిన్, మిచెల్ మార్ష్, హారిస్, హాజల్‌వుడ్, జాన్సన్, లియోన్, సిడిల్.