స్మిత్‌కు కెప్టెన్సీ! | Smith is the captain of Australia | Sakshi
Sakshi News home page

స్మిత్‌కు కెప్టెన్సీ!

Published Sat, Nov 22 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

Smith is the captain of Australia

ఆస్ట్రేలియా మాజీల మద్దతు

 సిడ్నీ: భారత్‌తో తొలి టెస్టులో మైకేల్ క్లార్క్ ఆడేది అనుమానంగా మారడటంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. క్లార్క్ గైర్హాజరీలో సహజంగానే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

అయితే హాడిన్‌కంటే భవిష్యత్తు కోసం కొత్త తరం ఆటగాడిని ఎంపిక చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అందుకు గాను స్టీవెన్ స్మిత్ సరైన వ్యక్తిగా ఎక్కువ మంది భావిస్తున్నారు. స్మిత్‌కు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలంటూ ఆసీస్ మాజీ ఆటగాడు కిమ్ హ్యూస్, మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement