Smith Ruled Out of South Africa Tour Due to Wrist Injury - Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. ! ఇక అంతే మరి

Published Fri, Aug 18 2023 2:10 PM | Last Updated on Fri, Aug 18 2023 3:11 PM

Smith ruled out of South Africa tour due to wrist injury - Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌ గాయాల కారణంగా ప్రోటీస్‌ టూర్‌కు దూరమయ్యారు. స్మిత్‌ ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా గాయపడిన స్మిత్‌.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరో రెండు నెలలో వన్డే ప్రపంచకప్‌ ఉండడటంతో అతడిని ఆడించి రిస్క్‌ చేయకూడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావించింది.

ఈ క్రమంలో స్మిత్‌ నాలుగు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు మిచిల్‌ స్టార్క్‌ గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా మరో నాలుగు నుంచి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి స్మిత్‌, స్టార్క్‌ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారినపడడం ఆస్ట్రేలియా మెన్‌జ్‌మెంట్‌ను కలవరపెట్టే ఆంశమనే చెప్పుకోవాలి. 

ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు స్మిత్‌ స్ధానాన్ని ఆస్టన్‌ టర్నర్‌తో భర్తీ చేయగా.. వన్డేల్లో మార్నస్‌ లాబుషేన్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. అదేవిధంగా స్టార్క్‌ స్ధానాన్ని యువ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌తో క్రికెట్‌ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. కంగూరు జట్టు ప్రోటిస్ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 30న డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20తో ఆసీస్‌ పర్యటన ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఆసీస్‌ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా

దక్షిణాఫ్రికాతో వన్డే  సిరీస్‌కు ఆసీస్‌ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా
చదవండి#Virat Kohli: అరంగేట్రంలో విఫలం.. కట్‌ చేస్తే.. ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా! ఏకంగా సచిన్‌తో పోటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement