Dharamsala Test
-
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టుపై నీలినీడలు
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడేందుకు సిద్దమవుతున్నాయి. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధిని చిత్తు చేయాలని భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం భారత టూర్ విజయంతో ముగించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. టీమిండియా సోమవారం చేరుకునే ఛాన్స్ ఉంది. నీలినీడలు.. అయితే ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆఖరి టెస్టు సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఆదివారం(మార్చి 3) అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు తెలుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాకుండా అక్కడ చాలా చల్లని వాతావరణం ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. "ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతేకాకుండా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగానూ ఉండే ఛాన్స్ ఉంది. వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని" నివేదిక పేర్కొంది. -
సమష్టి మంత్రం...విజయ సూత్రం
♦ అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత్ ♦ విదేశీ పిచ్‌లపై కూడా రాణించాలి ధర్మశాల టెస్టులో విజయానికి కావాల్సిన రెండు పరుగులను పూర్తి చేసిన అనంతరం లోకేశ్ రాహుల్ విజయ గర్వంతో గాల్లోకి ఎగిరి ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ సింహనాదం చేశాడు. ఈ సిరీస్ ఎలాంటి స్థితిలో ముగిసిందో అర్ధం చేసుకోవడానికి ఇది చాలేమో? 2005 యాషెస్ సిరీస్ అనంతరం అంత ఉద్విగ్నంగా జరిగిన సిరీస్ ఇదే అని విశ్లేషకులు చెబుతున్న మాట. వివాదాలు.. కవ్వింపు చర్యలు.. ఫిర్యాదులు.. ఆసీస్ మీడియా ఎదురుదాడి.. టీమిండియా కెప్టెన్ ఘాటైన సమాధానాలు.. అంతకుమించి అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుంచుకునే రీతిలో ఇరు జట్ల ఆటగాళ్ల వీరోచిత ప్రదర్శన.. వెరసి భారత, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను రెండు కొదమ సింహాల సమరంగా వర్ణించవచ్చు. సాక్షి క్రీడా విభాగం : గతేడాది సెప్టెంబర్ 22న భారత జట్టు స్వదేశంలో తమ టెస్టు సీజన్‌కు తెర లేపింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కోహ్లి సేన న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లతో ఆడింది. అన్నింటిని క్లీన్‌స్వీప్ చేసి ఆస్ట్రేలియాకు గట్టి సవాల్ విసిరింది. దీనికి తగ్గట్టుగానే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అంతా భారత్‌నే ఫేవరెట్‌గా చెప్పుకున్నారు. క్లీన్‌స్వీప్ ఖాయం.. అది 4–0తోనా లేక 3–0తోనా తేలాల్సి ఉంది అని లెక్కలేశారు. కానీ సిరీస్ ప్రారంభమయ్యాక భారత్ విజయం అంత సులువు కాదని తేలిపోయింది. పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ స్పిన్ దెబ్బకు భారత్ అనూహ్యంగా కుదేలైపోయింది. స్పిన్నర్ ఒకీఫ్ ఏకంగా 12 వికెట్లతో రెచ్చిపోవడంతో భారత్ అత్యంత అవమానకర రీతిలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 105, 107 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 333 పరుగులతో దారుణ ఓటమి. సర్వత్రా ఎదురైన విమర్శలను తట్టుకున్న కోహ్లి బృందం ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జట్టు కోలుకున్న తీరు ప్రశంసనీయం. సమష్టి మంత్రాన్ని జపిస్తూ ఏకంగా సిరీస్‌నే దక్కించుకుంది. మొత్తం 25 వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా ఏకంగా ప్రపంచ టెస్టు క్రికెట్లో నంబర్‌వన్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ యాదవ్ 17 వికెట్లతో భారత పిచ్‌లపై పేసర్ కూడా ఎక్కువ వికెట్లు తీయగలడని చాటి చెప్పాడు. ఈ సిరీస్‌లో భారత్ ఆందోళన పడిన విషయం ఒక్క కోహ్లి ఫామ్ గురించే. విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా బ్యాటింగ్‌లో అదరగొట్టారు. కరుణ్ నాయర్ మాత్రం తనకు లభించిన అవకాశాన్ని సొమ్ము చేసుకోలేకపోయాడు. బెంగళూరులో భళా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో బెంగళూరు మ్యాచ్ భారత్‌కు కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ రెండో టెస్టులో భారత్ పోరాడిన తీరు అపూర్వం. స్పిన్నర్ నాథన్ లయన్ ఎనిమిది వికెట్లతో దాడి చేయడంతో తొలి రోజే భారత్ 189 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 92 పరుగులతో అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 188 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆసీస్ కచ్చితంగా 2–0తో సిరీస్‌లో పైచేయి సాధిస్తుందనే అనుకున్నారు. అయితే ఆ జట్టును భారత్ అద్భుత రీతిలో అడ్డుకుని 112 పరుగులకు కుప్పకూల్చగలిగింది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరేసి వికెట్లతో చెలరేగి సిరీస్ సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వివాదాలూ ఇక్కడి నుంచే.. సిరీస్‌లో అసలైన వేడి కూడా ఈ టెస్టు నుంచే ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో తన అవుట్‌పై స్టీవ్ స్మిత్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆసీస్ జట్టు మోసంతో ఆడుతోందని భారత జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. అయితే ఇరు జట్ల మధ్య ఈ వివాదం సమసిపోయినా అటు ఆసీస్ మీడియా మాత్రం కోహ్లిపై దుమ్మెత్తి పోసింది. కోహ్లిని ఏకంగా ట్రంప్‌తో పోలుస్తూ రోజుకో కథనాలు వండివార్చింది. దీనికి అతను కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక రాంచీలో పుజారా డబుల్ సెంచరీ, సాహా సెంచరీతో విజయం ముంగిట నిలిచినా హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష ఓపిగ్గా క్రీజులో నిలిచి మ్యాచ్ ‘డ్రా’గా ముగించారు. కోహ్లి లేకున్నా... చివరి టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి గాయంతో బరిలోకి దిగకున్నా అజింక్యా రహానే జట్టును నడిపించిన తీరు ప్రశంసలందుకుంది. స్వయంగా కోహ్లి సైతం అతడి కెప్టెన్సీని పెవిలియన్‌లో కూర్చుని ఆస్వాదించినట్టు చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను దెబ్బతీయగలిగాడు. తనలోని భావోద్వేగాలను బయటపెట్టకుండా మరో ‘మిస్టర్ కూల్’గా జట్టును విజయం వైపు నడిపించగలిగాడు. జడేజా ఆల్‌రౌండ్ షోతో పాటు లోకేశ్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ షార్ట్ పిచ్ బంతులతోనూ భయపెట్టగలనని నిరూపించాడు. ఇక కోహ్లి స్థానంలో బరిలోకి దిగిన ‘చైనామన్ స్పిన్నర్’ కుల్దీప్ యాదవ్ సంచలన అరంగేట్ర ప్రదర్శన చేశాడు. నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేశాడు. ఇక విదేశాల్లోనూ వణికించాలి! స్వదేశంలో జరిగిన 13 టెస్టుల్లో 10 మ్యాచ్‌లు గెలవడంతో పాటు నాలుగు సిరీస్‌లనూ దక్కించుకున్న భారత్... ఇక విదేశీ పిచ్‌లపై అదరగొట్టాల్సి ఉంది. అప్పుడే ఈ విజయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది. నిజానికి సొంతగడ్డపై మనకు లభించే అనుకూల పరిస్థితులను సొమ్ము చేసుకుని గెలవడం బాగానే కనిపిస్తుంది. కానీ విదేశాలకు వెళ్లి అక్కడ సిరీస్‌లు నెగ్గితే లభించే గౌరవమే వేరు. అందునా టెస్టు క్రికెట్లో నంబర్‌వన్‌గా ఉన్న జట్టుపై ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇప్పటికీ ఆసీస్, దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. మున్ముందు ఇదే జోరుతో టీమిండియా ఆ లోటు తీరుస్తుందని ఆశిద్దాం. -
అశ్విన్‌కు సోబర్స్ ట్రోఫీ...
ధర్మశాల టెస్టు ముగిసిన తర్వాత భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు పురస్కారాలను అందజేసింది. 2016 సంవత్సరానికి అశ్విన్ ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేతులమీదుగా అశ్విన్ ‘గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ అందుకున్నాడు. ‘ఐసీసీ ద్వారా రెండు ఉత్తమ పురస్కారాలకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. స్వదేశంలో ఈ రెండు అవార్డులను అందుకున్నందుకు నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా నా సహచరులకు, కుటుంబసభ్యులకు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. -
నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్
ధర్మశాల: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా నోరు పారేసుకుని, అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. సిరీస్ ఓటమి సందర్భంగా దిగొచ్చాడు. తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, తనను క్షమించాల్సిందిగా స్మిత్ కోరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ధర్మశాలలో కీలక నాలుగో టెస్టులో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ మాట్లాడుతూ.. 'సిరీస్ అంతా గొడవలు, వివాదాలతో సాగింది. నేను ప్రతిసారీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా' అని చెప్పాడు. ఈ సిరీస్ భారత క్రికెటర్లు, ముఖ్యంగా బౌలర్లు బాగా రాణించారని స్మిత్ ప్రశంసించాడు. ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ మురళీ విజయ్ను స్మిత్ దూషించాడు. స్మిత్ నోరుపారేసుకున్నప్పటి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇక డీఆర్ఎస్ విషయంలోనూ పలుమార్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇతర ఆసీస్ ఆటగాళ్లు కూడా కెప్టెన్ స్మిత్ బాటలోనే ఘర్షణ వైఖరి అవలంభించారు. -
నాకు ఆశ్చర్యం కలిగించలేదు: దాదా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సాధించడం టీమిండియాకు గొప్ప విజయమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. భారత ఆటగాళ్లు బాగా రాణించారని అన్నాడు. ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ గెలుపొంది.. 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. 'టీమిండియాకిది గొప్ప విజయం. గ్రేట్ సమ్మర్. ఈ విజయం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే భారత గడ్డపై భారత్‌ను ఓడించడం చాలా కష్టం. 2001లో ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య టెస్టు సిరీస్ జరిగింది. నా క్రికెట్ కెరీర్లో నేను చూసిన అత్యంత బలమైన జట్టు అప్పటి ఆస్ట్రేలియానే. అయినా కంగారూలు టీమిండియాను ఓడించలేకపోయారు. ఈ సిరీస్‌లో కూడా ఆసీస్ 1-0తో ముందంజలో ఉన్నా చివరకు ఓటమి తప్పలేదు. ప్రపంచంలో ఏ జట్టుకైనా భారత్‌లో సిరీస్‌ను గెలవడం సవాలే' అని దాదా అన్నాడు. సిరీస్‌లో ఓడినా ఆసీస్ పోరాట పటిమ కనబరిచిందని ప్రశంసించాడు. -
క్రికెటర్ విజయ్‌ని స్మిత్ దారుణంగా తిట్టాడా?
ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో వివాదాలకు అడ్డే లేకుండా పోయింది. ప్రపంచంలో మేటి జట్లుగా పేరొందిన భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ అంటే సహజంగానే మైదానంలో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే ప్రస్తుత సిరీస్‌లో ఇరుజట్లు ధాటిగా తలపడుతున్నప్పటికీ.. ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వివాదాలు మాత్రం ఇరు జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్లెడ్జింగ్‌కు తోడు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 'డీఆర్ఎస్ వివాదం' సిరీస్‌ను కుదిపేసింది. డీఆర్ఎస్ రివ్యూ కోసం స్మిత్ డ్రెసింగ్ రూమ్ సలహాలు తీసుకోవడం పెద్ద దుమారమే రేపింది. ఇక రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమవ్వగా.. ఆసిస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోహ్లిని వెక్కిరించేలా అనుకరించడం వివాదం రేపింది. తాజాగా ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్.. విజయ్ను దారుణంగా దుర్భాషలాడటం వివాదం రేపుతోంది. సిరీస్ ఎవరిదో తేల్చే నాలుగు టెస్టు మూడో రోజు సోమవారం.. జోష్ హజెల్‌వుడ్ బ్యాటుకు తగిలి వచ్చిన బంతిని స్లిప్‌లో ఉన్న మురళీ విజయ్ క్యాచ్ పట్టాడు. భారత ఆటగాళ్లు కాన్ఫిడెంట్‌గా అప్పీల్ చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన ఎంపైర్లు.. థర్డ్ ఎంపైర్‌కు నివేదించారు. థర్డ్ ఎంపైర్ మాత్రం బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నిర్ణయాన్ని వెలువరించాడు. హజెల్‌వుడ్ ఔటైతే తాను బ్యాటింగ్‌కు దిగాల్సి ఉండటంతో అందుకు సిద్ధమవుతూ కనిపించిన స్మిత్.. థర్డ్ ఎంపైర్ నిర్ణయం నేపథ్యంలో ఆగ్రహంగా స్పందిస్తూ.. విజయ్ను ఉద్దేశించి (ఫ.. చీట్) అంటూ దారుణంగా నోరుపారేసుకున్నాడు. డ్రెసింగ్ రూమ్‌లో అతని ఆగ్రహం, దుర్భాషలాడటం కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్మిత్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హజెల్‌వుడ్ నాటౌట్ నిర్ణయం పెద్దగా మ్యాచ్‌పై ప్రభావం చూపలేదు. అశ్విన్ బౌలింగ్‌లో ఆ తర్వాత బంతికే హజెల్‌వుడ్ ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 137 పరుగులకే చాపచుట్టేయడంతో 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది. In response to @BenHorne8 tweet. This is the video. pic.twitter.com/TiiClKS1BH — Neroli Meadows (@Neroli_M_FOX) March 27, 2017 -
కుల్దీప్పై కింగ్ ఆఫ్ స్పిన్ ప్రశంసల జల్లు!
ధర్మశాల: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి మ్యాచ్‌లోనే వీరోచిత ప్రతిభతో పర్యాటక జట్టును మట్టికరిపించాడు. ‘చైనామన్’ బౌలింగ్‌తో కంగారులను కూల్చిన కుల్దీప్.. తన స్పిన్‌ను మెరుగుపరుచుకోవడానికి స్పిన్ బౌలింగ్ దిగ్గజం, ఆస్ట్రేలియా లెజండరీ క్రికెటర్ షేన్ వార్న్ నుంచి సలహాలు పొందినట్టు తెలిపాడు. వార్న్ ఇచ్చిన టిప్స్ ఆసిస్‌ను దెబ్బతీయడంలో బాగా పనికొచ్చాయని చెప్పాడు. మొదటి టెస్టులోనే అద్భుతంగా రాణించిన కుల్దీప్ గురించి తాజాగా కింగ్ ఆఫ్ స్పిన్ షేన్ వార్న్ స్పందించాడు. అతని బౌలింగ్, స్పీన్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయంటూ కొనియాడాడు. 'ఏ దేశానికి చెందిన ఏ యువ స్పిన్నర్‌కైనా సహాయమందించడానికి నేను ఆనందంగా ముందుకొస్తాను. మణికట్టుతో బౌలింగ్ చేసే స్పిన్నర్లు వర్ధిల్లాలి. కుల్దీప్ అద్భుతంగా ఆడావు' అంటూ వార్న్ ట్వీట్ చేశాడు. ధర్మశాలలో కుల్దీప్ యాదవ్ సంధించిన ‘చైనామన్’ శైలిని ఎదుర్కోలేక.. అర్థం చేసుకోలేక ఆ జట్టు కంగారు పడిన సంగతి తెలిసిందే. తొలి సెషన్లో తుఫాన్ వేగంతో పరుగులు నమోదుచేసిన ఆసిస్.. తొలి టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల కుర్రాడు విసిరిన బంతుల ముందు ప్రత్యర్థి తడబడింది. ఒక దశలో 144/1తో భారీ స్కోరు దిశగా సాగిపోతున్నట్లు అనిపించిన కంగారూలు కుల్దీప్ జోరుకు తలవంచారు. కుల్దీప్ అద్భుతంగా రాణించి.. 68 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
కుల్దీప్ కా కమాల్!
సాక్షి క్రీడావిభాగం : ‘చైనామన్’ బౌలింగ్... భారత క్రికెట్‌కు పెద్దగా పరిచయం లేని శైలి. ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా ఇలాంటి బౌలర్లు లేరు. అదే కుల్దీప్ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. మణికట్టుతో బౌలింగ్ చేసే రెగ్యులర్ లెగ్ స్పిన్నర్‌కు ప్రతిబింబంలాంటిదే చైనామన్ శైలి. అంటే ఎడమచేతి వాటం బౌలర్ వేసే లెగ్ స్పిన్నే చైనామన్‌గా వ్యవహరిస్తారు. 2014 అండర్–19 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సహా 14 వికెట్లు తీసినప్పుడు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్లకు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు భారీ మొత్తానికి తీసుకున్నప్పుడే కుల్దీప్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అంతకు ముందు ముంబై ఇండియన్స్‌తో ఉన్నప్పుడు ప్రాక్టీస్ సెషన్లో సచిన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసినప్పుడు ప్రశంసలే దక్కాయి తప్ప మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు! 2014లో విండీస్‌తో వన్డే సిరీస్ కోసం జట్టులోకి ఎంపికైనా... ఇక్కడా మ్యాచ్ దక్కలేదు. ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత అతను ఎప్పటికీ గుర్తుంచుకునే రీతిలో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. చిన్నప్పుడు టేబుల్ టెన్నిస్‌ను విరామం లేకుండా ఆడే కుల్దీప్ తండ్రి కోరిక తీర్చేందుకు క్రికెట్లోకి ప్రవేశించాడు. కాన్పూర్‌కు చెందిన ఇటుకల వ్యాపారి రామ్ సింగ్ తన తమ్ముడిని క్రికెటర్‌ను చేద్దామని ప్రయత్నించి విఫలం కావడంతో కొడుకును ఆటలోకి తీసుకొచ్చాడు. వసీం అక్రమ్‌లా ఫాస్ట్ బౌలర్ కావాలని అనుకున్నా, తగిన ఎత్తు లేడంటూ కోచ్ కపిల్ పాండే చేసిన సూచనతో ఇష్టం లేకున్నా స్పిన్ బౌలింగ్‌కు మారాడు. తనకు తెలీకుండానే కుల్దీప్ మణికట్టును భిన్నంగా వాడే శైలిని గుర్తించిన కోచ్ అదే తరహాలో ప్రోత్సహించాడు. ఆ తర్వాత షేన్ వార్న్‌ను ఇష్టపడిన ఈ కుర్రాడు ఇప్పటికీ వార్న్ వీడియోలు చూసి చాలా నేర్చుకుంటాడు. ‘వార్న్‌ను కలిసినప్పుడు ఇచ్చిన కొన్ని సూచనలతోనే అదే ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్‌ను తొలి వికెట్‌గా అవుట్ చేయడం చాలా గర్వంగా ఉంది’ అని అతను చెప్పుకున్నాడు. కోల్‌కతా జట్టులో తనలాంటి బౌలర్ బ్రాడ్ హాగ్ వచ్చాక అతని పర్యవేక్షణలో కుల్దీప్ బౌలింగ్ మరింత పదునెక్కింది. అయితే ఉత్తరప్రదేశ్ జట్టులో అప్పుడప్పుడు ఒక మ్యాచ్ ఆడటం తప్ప అతనికి రెగ్యులర్‌గా చోటు దక్కలేదు. గత ఏడాది ఐదు రంజీ మ్యాచ్‌లలో అతను 13 వికెట్లే తీయగలిగాడు. నిజానికి 33.11 ఫస్ట్‌క్లాస్ బౌలింగ్ సగటుతో భారత టెస్టు జట్టులోకి కుల్దీప్కు అవకాశం దక్కడం ఆశ్చర్యకరమే. అయితే సీజన్ ఆరంభంలో దులీప్ ట్రోఫీలో సెలక్టర్లు, కోచ్ కుంబ్లే సమక్షంలో మూడు మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీయడం అతనికి కలిసొచ్చింది. ‘నేనే గనక సెలక్టర్‌ను అయి ఉంటే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడకపోయినా కుల్దీప్ను భారత జట్టులోకి ఎంపిక చేసేవాడిని. అతనిపై సెలక్టర్లు ఒక కన్నేసి ఉంచడం మంచిది’ అని కొన్నాళ్ల క్రితం కుల్దీప్ యాదవ్ గురించి దిగ్గజ క్రికెటర్ గావస్కర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో, ఆ తర్వాత ఆసీస్‌తో గత మూడు టెస్టుల సమయంలో కూడా భారత జట్టుతోనే ఉన్న కుల్దీప్ కూడా తన ఎంపికను ఊహించి ఉండడు. కీలకమైన టెస్టులో భారత టీమ్ మేనేజ్మెంట్ ఒక రకమైన జూదం ఆడింది. కోహ్లిలాంటి స్టార్ బ్యాట్స్‌మన్ స్థానంలో ఒక కొత్త బౌలర్‌కు స్థానం ఇవ్వడమంటే ఎంతో రిస్క్‌తో కూడిన ప్రయోగం. దాదాపు ఏడాది క్రితం శ్రీలంక చైనామన్ బౌలర్ లక్షణ్ సందకన్‌ను ఎదుర్కోవడంలో ఆసీస్ తీవ్రంగా ఇబ్బంది పడింది. అతనూ తన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో కంగారూలను దెబ్బ తీశాడు. దీనినే దృష్టిలో ఉంచుకొని కుంబ్లే బృందం ఆసీస్ ముందు అనూహ్యంగా తమ ట్రంప్‌కార్డ్‌ను బయటకు తీసింది. అశ్విన్, జడేజాలు ఉన్న చోట మూడో స్పిన్నర్ వస్తాడని, అతను ఇలాంటి బౌలర్ అవుతాడని ఆసీస్ ఊహించలేదు. కనీసం వీడియోలు చూసి సన్నద్ధమయ్యే అవకాశం కూడా ఆ జట్టుకు లేకపోయింది. హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్ బౌల్డ్ అయిన బంతులు కుల్దీప్ బౌలింగ్ ప్రతిభను చూపించాయి. కుల్దీప్ తీసిన ప్రతీ వికెట్‌కు డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుంబ్లే సంబరపడిన తీరు చూస్తే ఆ వ్యూహం ఎంత బాగా పని చేసిందో అర్థమవుతోంది. భారత 288వ టెస్టు క్రికెటర్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్ శివరామకృష్ణన్ నుంచి క్యాప్ అందుకున్న కుల్దీప్ తన సంచలనాలను కొనసాగించాలని ఆశిద్దాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే... 1933లో ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. చైనా సంతతికి చెందిన విండీస్ బౌలర్ ఎలిస్ అచాంగ్ సాంప్రదాయ స్పిన్నర్ వేసే బంతికి భిన్నంగా వేసిన ఒక బంతికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ వాల్టర్ రాబిన్స్ అవుటయ్యాడు. తిరిగి వెళుతూ అతను ‘బ్లడీ చైనామన్’ అనడంతో ఆ బౌలింగ్ శైలి చైనామన్‌గా స్థిరపడిపోయింది. అన్నట్లు కుల్దీప్‌కంటే ముందు యూపీకే చెందిన మహిళా చైనామన్ బౌలర్ ప్రీతి దిమ్రి భారత్‌కు 2 టెస్టులు, 23 వన్డేల్లో (2006–10) ప్రాతినిధ్యం వహించడం విశేషం. -
విరాట్ కోహ్లి ఔట్
-
విరాట్ కోహ్లి ఔట్
ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరగనున్న కీలకమైన నాలుగో టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ టెస్టులో భుజానికి గాయమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో సిరీస్ ఎవరి వశం కానుందో తేల్చే ఈ టెస్టులో జట్టుకు అజింక్యా రహానే సారథిగా వ్యవహరించనున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా చెరో విజయంతో సమం చేశాయి. నాలుగో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి (శనివారం) నుంచి బరిలోకి దిగబోతున్నాయి. ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియం ‘తొలిసారి’గా వేదిక కానుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు స్వదేశంలో అద్భుత ఆటతీరుతో.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును కూడా ఇదే కోవలోకి చేర్చాలనే కసితో విరాట్ సేన ఉంది. అయితే 1-1తో సిరీస్ సమంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి లేకపోవడం.. భారత్‌కు కొంత ప్రతికూలతేనని అంటున్నారు. ఇక మూడో టెస్టులో భారత్ విజయావకాశాలను సమర్థంగా అడ్డుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. నైతికంగా తామే గెలిచామనే భావనతో చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ప్యాట్ కమిన్స్, హేజల్‌వుడ్ దూకుడుకు ఇక్కడి బౌన్సీ పిచ్ సహకారం అందిస్తే భారత్‌కు తిప్పలు తప్పవు. వార్నర్ మినహా అంతా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే్చ అంశం. దీంతో 2004 అనంతరం భారత గడ్డపై ఓ టెస్టు సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మరోసారి ఈ ట్రోఫీని గెల్చుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.