అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ... | Ravichandran Ashwin receives Sir Garfield Sobers Trophy | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ...

Published Wed, Mar 29 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ...

అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ...

ధర్మశాల టెస్టు ముగిసిన తర్వాత భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెండు పురస్కారాలను అందజేసింది. 2016 సంవత్సరానికి అశ్విన్‌ ‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’... ‘ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ చేతులమీదుగా అశ్విన్‌ ‘గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ’ అందుకున్నాడు.

 ‘ఐసీసీ ద్వారా రెండు ఉత్తమ పురస్కారాలకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. స్వదేశంలో ఈ రెండు అవార్డులను అందుకున్నందుకు నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా నా సహచరులకు, కుటుంబసభ్యులకు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement