ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడేందుకు సిద్దమవుతున్నాయి. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధిని చిత్తు చేయాలని భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం భారత టూర్ విజయంతో ముగించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. టీమిండియా సోమవారం చేరుకునే ఛాన్స్ ఉంది.
నీలినీడలు..
అయితే ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆఖరి టెస్టు సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఆదివారం(మార్చి 3) అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు తెలుస్తోంది.
రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాకుండా అక్కడ చాలా చల్లని వాతావరణం ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. "ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.
అంతేకాకుండా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగానూ ఉండే ఛాన్స్ ఉంది. వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని" నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment