Dharamsala
-
ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ విరామ సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. England cricketer James Anderson and his teammates enjoying a refreshing dip in a local khadd in Dharamshala 😍 pic.twitter.com/JQravFPLvM — Go Himachal (@GoHimachal_) March 6, 2024 ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిలో మమేకమైపోయారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా కనెక్టైనట్లుంది. హిమాచల్ ప్రదేశ్ శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతలస్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లీష్ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగిస్తుంటుంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహపరిచింది. బజ్‌బాల్ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్ సేన దెబ్బకు తోకముడిచారు. బెన్ డకెట్, ఓలీ పోప్, రూట్ సెంచరీలు మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు లేవు. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. -
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టుపై నీలినీడలు
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడేందుకు సిద్దమవుతున్నాయి. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధిని చిత్తు చేయాలని భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం భారత టూర్ విజయంతో ముగించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. టీమిండియా సోమవారం చేరుకునే ఛాన్స్ ఉంది. నీలినీడలు.. అయితే ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆఖరి టెస్టు సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఆదివారం(మార్చి 3) అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు తెలుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాకుండా అక్కడ చాలా చల్లని వాతావరణం ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. "ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతేకాకుండా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగానూ ఉండే ఛాన్స్ ఉంది. వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని" నివేదిక పేర్కొంది. -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
భారత్-సఫారీల తొలి వన్డేకు అంతరాయం
ధర్మశాల: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల తొలి వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఉదయం నుంచి పలు దఫాలుగా వర్షం పడుతూ ఉండటంతో మ్యాచ్‌కు ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం ఆగిపోవడంతో పిచ్‌ను తయారు చేసేపనిలో పడ్డారు గ్రౌండ్‌మెన్. దాంతో టాస్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చల్లటి వాతావరణం, తేమ కారణంగా మొదటినుంచి ఇక్కడి పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. గతంలో చూస్తే రెండో బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు నెగ్గాయి.(స్వదేశంలో మళ్లీ ఆట మొదలు) న్యూజిలాండ్ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లలో అవమానకరంగా వైట్‌వాష్‌కు గురైన తర్వాత కొంత విరామంతో భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. అయితే ఇప్పుడు వేదిక సొంతగడ్డకు మారింది. గత అక్టోబరులో ఇక్కడే జరిగిన టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా నాటి పర్యటనకు కొనసాగింపుగా ఇప్పుడు కేవలం వన్డేల కోసమే వచ్చింది. స్వదేశంలో ఆస్ట్రేలియాను వన్డేల్లో చిత్తు చేసిన ఉత్సాహంతో సఫారీలు భారత్‌లో అడుగు పెట్టారు. అయితే భారత్‌లో కోహ్లి సేనను నిలువరించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సమరం ఆసక్తికరంగా సాగనుంది.(డి కాక్ చెలరేగిపోగలడు!) Latest visuals coming in from Dharamsala. Does not look great at the moment.#INDvSA pic.twitter.com/Ob0GMvplm0 — BCCI (@BCCI) March 12, 2020 -
'నేను చిన్న చీమలా ఉన్నా'
ప్రకృతి ఎవరినైనా అలరిస్తుంది. అందునా హిమాలయాల అంచున ఉన్న ధర్మశాల ప్రకృతి అందాలకు ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. భారత కోచ్ రవిశాస్త్రి సైతం ఇందుకు అతీతుడు కాదు. ధర్మశాల చుట్టూ ఉన్న ప్రకృతి ఆయను విపరీతంగా నచ్చిందంట. అంతే ఇంకేముంది సోషల్ మీడియా ట్విట్టర్లో ధర్మశాల, పక్కనే ఉన్న హిమాలయాలను పొగుడుతూ పోస్టుపెట్టేశాడు. చుట్టూ ఉన్న భారీ అందాల మధ్య తానో చిన్న చీమగా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. హిమాలయాల అందాలు అద్భుతంగా ఉన్నాయని, క్రికెట్‌కు చాలా అనుకూలంగా ఉందంటూ ధర్మశాలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక భారత్-శ్రీలంకల మధ్య జరగున్న మొదటి వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలుకున్న విరాట్ సేన వన్డేల్లోను తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఇప్పటికే ధర్మశాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. Feel like an ant with the giant in the background. THE MIGHTY HIMALAYAS. What a setting for #cricket #TeamIndia pic.twitter.com/hPoseRuo6H — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 Breathe easy in Dharamsala #TeamIndia #INDvSL pic.twitter.com/DpvQZ7KQfq — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 -
‘చైనామన్’ చేతికి చిక్కారు
► కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు ► ఆస్ట్రేలియా 300 ఆలౌట్ ► స్మిత్ వీరోచిత సెంచరీ ► రాణించిన వార్నర్, వేడ్ ధర్మశాలలో కుల్దీప్ యాదవ్ రూపంలో భారత్ సంధించిన కొత్త అస్త్రం ఆస్ట్రేలియాను కూల్చింది. ‘చైనామన్’ శైలి బౌలింగ్‌కు సిద్ధం కాక, దానిని అర్థం చేసుకోలేక ఆ జట్టు కంగారు పడింది. ఆసీస్ టాస్ గెలిచింది, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది, వార్నర్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు... ఎప్పటిలాగే స్మిత్ తనదైన శైలిలో దూసుకుపోయాడు. తొలి సెషన్లో తుఫాన్ వేగంతో పరుగులు నమోదయ్యాయి. అన్నీ అనుకూలంగా సాగిపోతున్న వేళ తొలి టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల కుర్రాడు విసిరిన బంతుల ముందు ప్రత్యర్థి తడబడింది. కోహ్లి స్థానంలో ఏ బ్యాట్స్‌మెనో వస్తాడని అనుకుంటే భారత్ కొత్త బౌలర్‌ను బరిలోకి దింపి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఫలితంగా ఒక దశలో 144/1తో భారీ స్కోరు దిశగా సాగిపోతున్నట్లు అనిపించిన కంగారూలు కుల్దీప్ జోరు ముందు తలవంచారు. రెండో సెషన్లో పరుగులు తీయలేక స్మిత్ సేన టపటపా వికెట్లు కోల్పోయింది. వేడ్ పుణ్యమా అని చివర్లో కోలుకున్నా... మొత్తానికి ఆధిపత్యం మాత్రం భారత్‌దే. మొదటి రోజు ఆటలో బ్యాట్స్‌మెన్, పేసర్లు, స్పిన్నర్లు అందరికీ అనుకూలించిన చోట రెండో రోజు మన బ్యాట్స్‌మెన్ నిలబడితే టెస్టు మన చేతుల్లోకి వచ్చినట్లే. అయితే కొత్త బంతితో తొలి సెషన్లో హాజల్‌వుడ్, కమిన్స్‌లను ఎదుర్కోవడమే కీలకం. ధర్మశాల: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నిర్ణయాత్మక టెస్టులో తొలి రోజు భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారీ స్కోరు చేయకుండా ఆసీస్‌ను కట్టి పడేసింది. శనివారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (173 బంతుల్లో 111; 14 ఫోర్లు) సిరీస్‌లో మూడో సెంచరీ సాధించగా, మ్యాథ్యూ వేడ్ (125 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (4/68) నాలుగు వికెట్లతో రాణించగా... ఉమేశ్‌కు రెండు వికెట్లు, భువనేశ్వర్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లకు ఒక్కో వికెట్ లభించాయి. అనంతరం ఆట ప్రారంభించిన భారత్ ఒక ఓవర్ ఆడి పరుగులేమీ చేయలేదు. సెషన్ 1: ఆసీస్ దూకుడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా గత టెస్టులో ఆడిన జట్టునే కొనసాగించింది. వంద శాతం ఫిట్‌గా లేని కోహ్లి తప్పుకోగా, అతని స్థానంలో కుల్దీప్కు అవకాశం దక్కగా... ఇషాంత్‌కు బదులుగా భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే మూడో స్లిప్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ వదిలేయడంతో వార్నర్ బతికిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లోనే రెన్షా (1)ను బౌల్డ్ చేసి ఉమేశ్ ఆసీస్‌ను దెబ్బ తీశాడు. అయితే ఈ దశలో వార్నర్, స్మిత్ కలిసి భారత బౌలర్లను ఆడుకున్నారు. స్మిత్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా, సిరీస్‌లో తొలిసారి వార్నర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాలోని వికెట్ల తరహాలో పిచ్‌పై చక్కటి బౌన్స్ ఉండటంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ముందుగా 67 బంతుల్లో స్మిత్, ఆ తర్వాత వార్నర్ 72 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ సెషన్లో ఆస్ట్రేలియా వేగంగా 4.22 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఓవర్లు: 31, పరుగులు: 131, వికెట్లు: 1 సెషన్ 2: కుల్దీప్ మాయ విరామం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్న పిచ్‌పై ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అద్భుత బంతితో వార్నర్‌ను అవుట్ చేసి కెరీర్లో తొలి వికెట్ సాధించిన కుల్దీప్ ఆటను మలుపు తిప్పగా, ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్‌లో షాన్ మార్‡్ష (4) వెనుదిరిగాడు. ఆ తర్వాత కుల్దీప్ మిస్టరీ బౌలింగ్‌ను ఆడలేక నాలుగు పరుగుల వ్యవధిలో హ్యాండ్స్కోంబ్ (8), మ్యాక్స్‌వెల్ (8) క్లీన్‌బౌల్డయ్యారు. మరో ఎండ్‌లో తన జోరు కొనసాగించిన స్మిత్ 150 బంతుల్లో తన కెరీర్లో 20వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్‌పై ఆడిన గత ఎనిమిది టెస్టుల్లో స్మిత్‌కు ఇది ఏడో సెంచరీ. అయితే కొద్దిసేపటికే చక్కటి బంతితో స్మిత్‌ను అశ్విన్ పెవిలియన్ పంపించడంతో ఆసీస్ కష్టాలు మరింత పెరిగాయి. ఓవర్లు: 30, పరుగులు: 77, వికెట్లు: 5 సెషన్ 3: ఆదుకున్న వేడ్ చివరి సెషన్లో ఆసీస్ కోలుకుంది. చివరి 4 వికెట్లకు ఆ జట్టు మరో 92 పరుగులు జోడించగలిగింది. సిరీస్‌లో తొలిసారి మెరుగైన ప్రదర్శన కనబర్చిన వికెట్ కీపర్ వేడ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతనికి కొద్దిసేపు కమిన్స్ (21), లయన్ (13) అండగా నిలిచారు. కమిన్స్‌ను అవుట్ చేసి మరోసారి కుల్దీప్ భారత్‌కు బ్రేక్ అందించగా... సబ్‌స్టిట్యూట్ శ్రేయస్ అయ్యర్ చక్కటి ఫీల్డింగ్‌కు ఒకీఫ్ (8) రనౌటయ్యాడు. 113 బంతుల్లో వేడ్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆరు బంతుల తేడాతో వేడ్, లయన్ వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ తొలి రోజు ఒకే ఒక ఓవర్ ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ముగించింది. ఓవర్లు: 27.3, పరుగులు: 92, వికెట్లు: 4 (ఆస్ట్రేలియా) ఓవర్లు: 1, పరుగులు: 0, వికెట్లు: 0 (భారత్) ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ (79) రికార్డు. స్టెయిన్ (దక్షిణాఫ్రికా–78 వికెట్లు; 2007–08 సీజన్) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు. భారత్‌పై ఒకే సిరీస్‌లో 3 సెంచరీలు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్మిత్. గతంలో హర్వే, ఓనీల్, హేడెన్, మార్టిన్ రెండేసి సెంచరీలు చేశారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రహానే (బి) కుల్దీప్ 56; రెన్షా (బి) ఉమేశ్ 1; స్మిత్ (సి) రహానే (బి) అశ్విన్ 111; షాన్ మార్ష్ (సి) సాహా (బి) ఉమేశ్ 4; హ్యాండ్స్కోంబ్ (బి) కుల్దీప్ 8; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 8; వేడ్ (బి) జడేజా 57; కమిన్స్ (సి అండ్ బి) కుల్దీప్ 21; ఒకీఫ్ (రనౌట్) 8; లయన్ (సి) పుజారా (బి) భువనేశ్వర్ 13; హాజల్‌వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (88.3 ఓవర్లలో ఆలౌట్) 300. వికెట్ల పతనం: 1–10; 2–144; 3–153; 4–168; 5–178; 6–208; 7–245; 8–269; 9–298; 10–300. బౌలింగ్: భువనేశ్వర్ 12.3–2–41–1; ఉమేశ్ 15–1–69–2; అశ్విన్ 23–5–54–1; జడేజా 15–1–57–1; కుల్దీప్ 23–3–68–4. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బ్యాటింగ్) 0; విజయ్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (1 ఓవర్లో) 0. బౌలింగ్: హాజల్‌వుడ్ 1–1–0–0. -
‘ధర్మశాల’ ఆసీస్‌కే అనుకూలం!
మాజీ పేసర్ జాన్సన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టుకు ముందు ఆసీస్ మాజీ ఆటగాడు మిషెల్ జాన్సన్ తన మాటలతో వేడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ధర్మశాల స్టేడియంలోని పిచ్ భారత్‌నే ఒత్తిడిలో పడేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆసీస్‌కు అనుకూలించే మైదానమని అతను అన్నాడు. ‘ధర్మశాల స్టేడియం చాలా బాగుం టుంది. ఇక్కడి పిచ్‌పై సాధారణంగా పచ్చిక ఎక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఇది ఆస్ట్రేలియాలో ఉండే మైదానంలా కనిపిస్తోంది. దీనిని చూస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే, భారత్ మాత్రం ఒత్తిడిలో పడటం ఖాయం. నిజానికి భారత్ ఈ సిరీస్‌లో అతి విశ్వాసంతో ఆడింది. 1–1తో ప్రస్తుతం సమంగా ఉండటమే అందుకు నిదర్శనం’ అని జాన్సన్ అభిప్రాయ పడ్డాడు. -
హిమాచల్ రెండో రాజధానిగా ధర్మశాల
షిమ్లా: ధర్మశాలను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధానిగా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ గురువారం ప్రకటించారు. కాంగ్రా జిల్లాలో ఉండే ధర్మశాలకు ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ఈ నగరం సముచితంగా ఉంటుందన్నారు. శీతాకాల విడిదికి విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ధర్మశాలలోనే ఉంటున్నారు. 2005లో తొలిసారి ఇక్కడ పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటికే 12 సార్లు ఇక్కడ శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది. -
పాక్ మ్యాచ్‌తో పాటు ఐపీఎల్ కూడా..
ధర్మశాల: చుట్టూ పర్వతాలు, ప్రకృతి సౌందర్యం మధ్య ధర్మశాల క్రికెట్ స్టేడియం మనోహరంగా ఉంటుంది. ఏ అవాంతరాలూ ఎదురుకాకుండా ఉన్నట్టయితే ఈ వేదికలో ఈ నెల 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మ్యాచ్ జరిగేది. అయితే భద్రత కల్పించలేమని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా మ్యాచ్‌ను వ్యతిరేకించడం.. ఈ పర్యవసానాల వల్ల ధర్మశాలలో తాము ఆడబోమని పాకిస్తాన్ షరతుపెట్టడంతో వేదికను కోల్‌కతాకు తరలించారు. అయితే ఈ విషయంలో ధర్మశాల స్టేడియం నిర్వాహకులకు గాని, స్థానిక క్రికెట్ బోర్డుకు గానీ సంబంధం లేదు. భారత్-పాక్ మ్యాచ్ జరగాలనే కోరుకున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల కారణంగా ధర్మశాల స్టేడియం మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఈ స్టేడియం కోల్పోయింది. హోమ్ టీమ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ తమ మ్యాచ్‌లను ధర్మశాల నుంచి నాగ్‌పూర్‌కు తరలించాలని బీసీసీఐని కోరింది. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ షెడ్యూల్లో ధర్మశాలను వేదికగా చేర్చలేదు. ఆటగాళ్లకు భద్రత ఏర్పాటు చేసినందుకుగాను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేయడం, వినోదపు పన్ను కారణంగా ఈ వేదికలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆసక్తి చూపడం లేదు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రతినిధి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం రాజకీయాలే దీనికి కారణమన్నారు. -
బీసీసీఐని తప్పుబట్టిన సీఎం!
సిమ్లా: భారత్-పాక్ మ్యాచ్ వేదిక అంశంపై ప్రతిరోజు ఏదో ఓ వార్త వస్తూనే ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల19న దాయాదుల మధ్య పోరు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ వెంటనే మేము ఇక్కడ భద్రత కల్పించలేము, ఇక్కడ మ్యాచ్ అనేది చాలాకష్టమని హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, బీసీసీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. నిన్న ఈ మ్యాచ్ వేధికను ధర్మశాల నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది. ఆ మరుసటి రోజు వీరభద్రసింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు కూడా డబ్బులు అవసరమే కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నారు. దాయాదుల మ్యాచ్ కు సెక్యూరిటీ మేం అందించలేమని ఎప్పుడూ పేర్కొనలేదని సీఎం వీరభద్రసింగ్ మాటమార్చారు. అంతటితో ఆగకుండా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పై విమర్శలకు దిగారు. మ్యాచ్ వేదిక మారడానికి ఠాకూర్ ప్రధాన కారణమంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి, కార్గిల్ అమరవీరుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు మ్యాచ్ ఇక్కడ నిర్వహించవద్దని కోరినట్లు మాత్రమే తాను కేంద్రానికి తెలిపినట్లు వివరించాడు. గతంలో ఎన్నో మ్యాచ్ లను నిర్వహించాం అన్నారు. అయితే ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని మాత్రమే తాను పేర్కొన్నట్లు వీరభద్రసింగ్ చెప్పుకొచ్చారు. -
ధర్మశాలలోనే భారత్-పాక్ మ్యాచ్
వేదిక మార్పు ఆలోచన లేదు: ఐసీసీ న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. పాక్‌తో మ్యాచ్‌కు సరైన భద్రత ఇవ్వలేమని హిమాచల్ ప్రదేశ్ సీఎం తేల్చిన విషయం విదితమే. ‘మ్యాచ్‌ల వేదికలను ఏడాది క్రితమే ప్రకటించాం. అయితే ధర్మశాల, ఢిల్లీ మ్యాచ్‌లపై సమస్యలున్న మాట నిజమే. మేం వాటిని పరిష్కరించే దిశగా వెళుతున్నాం. భారత ప్రభుత్వం ఇప్పటికే అన్ని జట్లకు తగిన రీతిలో భద్రత కల్పిస్తామని చెప్పింది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. ఫిక్సింగ్ ఆరోపణలపై ఓ అంతర్జాతీయ జట్టు విచారణ ఎదుర్కొంటున్న విషయాన్ని అంగీకరిస్తూనే వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. మరోవైపు ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మ్యాచ్‌లపై అస్పష్టత వీడింది. కీలకమైన కంప్లీషన్ సర్టిఫికెట్‌ను దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) నుంచి ఢిల్లీ క్రికెట్ సంఘం అందుకుంది. అయితే ఇది తాత్కాలిక ఆక్యుపెన్సీ సర్టిఫికెటేనని, మరో 20 రోజుల్లో స్టేడియంలోని 60 అతిక్రమణలను తొలగించాలని ఎస్డీఎంసీ షరతు విధించింది. ధర్మశాలకు పాక్ బృందం అమృత్సర్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు పాక్ బృం దం ధర్మశాలకు చేరుకుంది. పాక్ ఫెడరల్ పరిశోధక ఏజెన్సీ డెరైక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పీసీబీ ముఖ్య భద్రతాధికారి కల్నల్ ఆజం ఖాన్, మూడో సభ్యునిగా భారత్‌లోని పాక్ డిప్యూటీ హై కమిషనర్ ఉన్నారు. అలాగే టి20 ప్రపంచకప్‌లో పాక్ ఆడే ఒక్కో మ్యాచ్‌కు 250 మంది ఆ దేశ అభిమానులకు భారత్ వీసాలు ఇవ్వనుంది. ఈ జట్టు సెమీస్, ఫైనల్‌కు చేరితో ఈ సంఖ్యను పెంచుతారు. మరోవైపు భారత్‌లో భద్రత గురించి ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. -
ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు
టి20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు జట్లు భారత్‌కు చేరుకున్నాయి. గురువారం ధర్మశాలలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్పీసీఏ) ఎలెవన్ చేతిలో 7 వికెట్లతో ఓడింది. -
ఇంతకీ భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ?
న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై అనిశ్చితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్ర హోం శాఖకు ఈ మేరకు లేఖ రాశారు. భారత్, పాక్ మ్యాచ్‌కు భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదని లేఖలో పేర్కొన్నారు. పాక్‌తో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వరాదని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను ఎక్కడ నిర్వహిస్తారు? బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుదన్నది సందిగ్ధంగా మారింది. కాగా హిమాచల్ ప్రదేశ్ నిర్ణయాన్ని బీసీసీఐ కార్యదర్శి, బీజేపీ ఎంపీ అయిన అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు. ధర్మశాల వేదికగా భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించనున్న విషయం కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని, ఆ సమయంలో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలు చేయరాదని అన్నారు. టి-20 ప్రపంచ కప్ వేదికలను ఏడాది క్రితమే బోర్డు ఖరారు చేసిందని, ఆరు నెలల ముందు మ్యాచ్‌లను కేటాయించామని స్పష్టం చేశారు. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు కూడా అమ్మారని, ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం సరికాదన్నారు. దీనివల్ల భారత ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. దక్షిణాసియా గేమ్స్ సందర్భంగా పాకిస్తాన్ క్రీడాకారులకు అసోం ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. -
ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్
ముంబై: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐసీసీ తీపికబురు అందించింది. దాయాది జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. టి20 ప్రపంచకప్ లో భాగంగా మార్చి 19న రెండు జట్ల మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉన్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.