ప్రకృతి ఎవరినైనా అలరిస్తుంది. అందునా హిమాలయాల అంచున ఉన్న ధర్మశాల ప్రకృతి అందాలకు ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. భారత కోచ్ రవిశాస్త్రి సైతం ఇందుకు అతీతుడు కాదు. ధర్మశాల చుట్టూ ఉన్న ప్రకృతి ఆయను విపరీతంగా నచ్చిందంట. అంతే ఇంకేముంది సోషల్ మీడియా ట్విట్టర్‌లో ధర్మశాల, పక్కనే ఉన్న హిమాలయాలను పొగుడుతూ పోస్టుపెట్టేశాడు. చుట్టూ ఉన్న భారీ అందాల మధ్య తానో చిన్న చీమగా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. హిమాలయాల అందాలు అద్భుతంగా ఉన్నాయని, క్రికెట్‌కు చాలా అనుకూలంగా ఉందంటూ ధర్మశాలను పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇక భారత్-శ్రీలంకల మధ్య జరగున్న మొదటి వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలుకున్న విరాట్ సేన వన్డేల్లోను తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఇప్పటికే ధర్మశాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Feel like an ant with the giant in the background. THE MIGHTY HIMALAYAS. What a setting for #cricket #TeamIndia pic.twitter.com/hPoseRuo6H
— Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017
Breathe easy in Dharamsala #TeamIndia #INDvSL pic.twitter.com/DpvQZ7KQfq
— Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017
Comments
Please login to add a commentAdd a comment