టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు.
ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్‌గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది.
ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్ విజేత నవంబర్ 13న పాకిస్తాన్‌తో టైటిల్ పోరులో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment