పక్కింటి అబ్బాయిలా ఉంటాడు | Sumanth Ashwin's Right Right movie audio out now | Sakshi
Sakshi News home page

పక్కింటి అబ్బాయిలా ఉంటాడు

Published Mon, May 16 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

పక్కింటి అబ్బాయిలా ఉంటాడు

పక్కింటి అబ్బాయిలా ఉంటాడు

- దాసరి నారాయణరావు
‘‘ఈ చిత్రం పాటలు విన్నా. ఈ మధ్య ఇంత మెలోడీ పాటలున్న సినిమా ఏదీ రాలేదు. సుమంత్ అశ్విన్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కొన్ని సీన్స్ చూశా. బాగున్నాయి. హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ అశ్విన్‌లో ఉన్నాయి. విలన్ పాత్రలో నటించే ప్రభాకర్‌ను చూస్తే చాలా సెన్సిటివ్ అనిపిస్తోంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరి జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో మను దర్శకత్వంలో శ్రీసత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘రైట్... రైట్’.

జె.బి. స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి నారాయణరావు బిగ్ సీడీ, పాటల సీడీ ఆవిష్కరించి దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ఎంఎస్ రాజుకు అందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ గుర్తుకొస్తోంది. సుమంత్ అశ్విన్ బాగా నటిస్తున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. దర్శకునిగా పరిచయమవుతున్న మనుకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు.

‘‘డ్రైవర్‌కు, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఈ కథ మొదట ఎంఎస్ రాజుగారికే చెప్పా. ఆయనకు నచ్చి ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు. నటీనటులు, టెక్నీషియన్లు నాకు బాగా సపోర్ట్ చేశారు’’ అని దర్శకుడు మను తెలిపారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘‘క్షణం’, ‘ఊపిరి’వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు, కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని చెప్పారు. దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, నిర్మాత ‘దిల్’ రాజు, సహ నిర్మాత ఎమ్‌వి నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సంగీత దర్శకుడు కోటి, నటుడు సీనియర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement