లవ్‌ మెలోడీతో... | Ram Charan Game Changer third song to be out on this date | Sakshi
Sakshi News home page

లవ్‌ మెలోడీతో...

Published Mon, Nov 25 2024 3:42 AM | Last Updated on Mon, Nov 25 2024 3:42 AM

Ram Charan Game Changer third song to be out on this date

రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. శంకర్‌ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌ పతాకాలపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘జరగండి...జరగండి...’, ‘రా మచ్చా...’ పాటల లిరికల్‌ వీడియోలను విడుదల చేశారు. తాజాగా రామ్‌చరణ్, కియారా కాంబినేషన్‌లో రూపొందిన ఓ మెలోడీ సాంగ్‌ను ఈ నెల 28న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకి తమన్‌ స్వరకర్త. చలో మైసూర్‌: రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మైసూర్‌లో ఆరంభమైంది. ఈ షూట్‌లో పాల్గొనేందుకు ఆది వారం రామ్‌చరణ్‌ మైసూర్‌ వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement