రామ్‌ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ | Urvashi Rautela To Romance With Ram Pothineni For Special Song | Sakshi
Sakshi News home page

Urvashi Rautela : రామ్‌ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ

Published Fri, Oct 28 2022 11:52 AM | Last Updated on Fri, Oct 28 2022 11:56 AM

Urvashi Rautela To Romance With Ram Pothineni For Special Song - Sakshi

యంగ్‌ హీరో రామ్‌ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగనుంది.  పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది.. శ్రీనివాస సిల్వర్‌ స్కీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ రూమర్స్‌ని నిజం చేస్తూ హీరో రామ్‌తో సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించనుందనే న్యూస్‌ కన్‌ఫర్మ్‌ చేసినట్లయ్యింది. ఇక అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement