
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్–మెహర్ చాహల్, రోహన్–క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఇద్దరు యువకుల కథే ‘7 డేస్ 6 నైట్స్’. టైటిల్ చూసి హారర్ చిత్రం అనుకోవద్దు.. ఇదొక కూల్ ఎంటర్‌టైనర్. నాన్నగారు (ఎంఎస్ రాజు) అందంగా చిత్రీకరించారు’’ అన్నారు. ‘‘రాజుగారి నుంచి వచ్చే మరో క్లాసిక్ చిత్రమిది’’ అన్నారు చిత్ర సహనిర్మాత జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, సహనిర్మాత: మంతెన రాము.
Comments
Please login to add a commentAdd a comment