నిహారిక
‘‘మంచి పాత్రలు చేస్తే మంచి నటిగా గుర్తుండిపోతావు. చిన్న తప్పు చేసినా.. భూతద్దంలో పెట్టి చూస్తారు. వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి’ అని సినిమాల్లోకి వచ్చే ముందు పెదనాన్న (చిరంజీవి) చెప్పారు’’ అన్నారు నిహారిక. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిహారిక పంచుకున్న విశేషాలు...
► ‘‘హీరోలతో బయటి అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడితేనే ఏదేదో అంటుంటారు. నువ్వు మెగా ఫ్యామిలీ నుంచి వెళుతున్నావంటే నీపై కాన్‌సన్‌ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు నార్మల్‌గా కనిపించినా ఏదేదో రాసేస్తారు’’ అని నాన్న (నాగబాబు) అన్నారు. ప్రస్తుతం నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. సోషల్ మీడియాతో సమయం వృథా అని రెండేళ్లు ఫోన్ వాడలేదు. మళ్లీ ఈ మధ్యే వాడుతున్నాను.
► ‘హ్యాపి వెడ్డింగ్’లో అక్షర అనే సింపుల్ ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో కనిపిస్తా. ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోవాళ్ల సమ్మతంతో ఎంగేజ్‌మెంట్, పెళ్లి జరుగుతుంది. నా పాత్రవల్లే సమస్యలు, సొల్యూషన్స్ ఉంటాయి. ► చిరంజీవిగారి డ్యాన్స్ చూస్తూ పెరగడంతో నేర్చుకోవాల్సిన పని లేదనిపించింది. డ్యాన్స్ బాగా వచ్చినప్పటికీ నా మూడు సినిమాల్లో చేసే అవకాశం రాలేదు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే క్రమంలో కాళ్లపై కొట్టి నేర్పిస్తారు (నవ్వుతూ). అలా చేయడం వల్ల నాకు జ్వరం వచ్చి నేర్చుకోవడమే మానేశాను.
► నాకు 10–15 ఏళ్లు సినిమాల్లో నటించాలని లేదు. మూడు నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు మానేస్తాను. అయితే ప్రొడక్షన్ సైడ్ ఉంటాను. వెబ్ సిరీస్ చేసుకుంటాను. సినిమాలు మానేసిన తర్వాత నా సినిమాలు చూసుకుంటే నా ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చాలి. స్టార్ హీరోలతో ఇప్పటి వరకూ అవకాశం రాలేదు.. వస్తే చేస్తా.
► పెళ్లంటే చాలా గౌరవం. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోను. ప్రస్తుతం నా దృష్టి కెరీర్‌పైనే. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌లతో సినిమా చేసేటప్పుడు ట్యూటర్‌ని పెట్టుకుని తమిళం నేర్చుకున్నా. ఇప్పుడు రాస్తాను కూడా. ఇంట్లో నేనెవర్నీ ఇమిటేట్ చేయను.
► మెగా ప్రిన్సెస్ అన్నప్పుడల్లా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయనిపిస్తుంది. దానివల్ల కొన్నిసార్లు మంచే జరిగినా నాకు భయంగా ఉంటుంది. ‘కథ నీకు నచ్చితే చెయ్’ అని అన్నయ్య (వరుణ్ తేజ్) అంటారు. నా సినిమా కథ వినరు. ప్రణీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశాం. రాహుల్ విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నా.
∙చిరంజీవిగారి సినిమాలో ఆయనతో ఓ ఫ్రేమ్‌లో కనిపించినా చాలనుకునేదాన్ని. ‘సైరా’లో నటించాలని అన్నయ్య చరణ్‌ను బతిమలాడాను. సురేందర్‌రెడ్డిగారు వచ్చి ‘డైలాగ్స్ లేకున్నా పర్లేదా?’ అంటే.. ఓకే అన్నా. రెండు ఫ్రేమ్స్‌లో కనపడే చిన్న బోయ అమ్మాయిగా చేశా.
Comments
Please login to add a commentAdd a comment