Happy Wedding
-
నా టార్గెట్ వారే
‘‘నాది తిరుపతి. ఓంకార్‌గారి ‘జీనియస్’ షోకి నా స్నేహితుడు శ్రీహరి ఎంపికయ్యాడు. నేను కూడా తనతో పాటు హైదరాబాద్ వచ్చా. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి నన్ను కూడా ఎంపిక చేసుకోవడంతో ‘జీనియస్’ షోకి పని చేశా’’ అని డైరెక్టర్ లక్ష్మణ్ కార్య అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ– ‘‘మొగుడు’ సినిమాకు కెమెరా డిపార్ట్మెంట్లో, దేవా కట్టాగారి దగ్గర ‘ఆటోనగర్ సూర్య’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. ‘హ్యాపి వెడ్డింగ్’కి ముందు ‘ఎందుకిలా’ వెబ్ సిరీస్ చేశా. ఆ సమయంలో సుమంత్ అశ్విన్గారితో ఏర్పడిన పరిచయంతో ‘హ్యాపి వెడ్డింగ్’ సెట్ అయింది. ఫ్యామిలీ, మహిళా ప్రేక్షకులను టార్గెట్ చేసి ‘హ్యాపి వెడ్డింగ్’ చేశా. వారి నుంచి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. తొలి నరేషన్‌లోనే నిహారిక ఇందులో నటించడానికి ఒప్పుకున్నారు. సినిమా విడుదల తర్వాత నాగబాబుగారు ఫోన్ చేసి అభినందించడం వెరీ హ్యాపీ. నా తర్వాతి చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు. -
వెడ్డింగ్ ఎప్పుడు
-
‘హ్యాపి వెడ్డింగ్’ మూవీ రివ్యూ
టైటిల్ : హ్యాపి వెడ్డింగ్ జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, ఇంద్రజ తదితరులు.. సంగీతం : శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం : తమణ్ ఎస్ దర్శకత్వం : లక్ష్మణ్ కార్య నిర్మాత : పాకెట్ సినిమా స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెలలు తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హ్యాపి వెడ్డింగ్. నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా యువీ క్రియేషన్స్ లాంటి సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ సమర్పణలో తెరకెక్కటంతో రిలీజ్ కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆడియోతో పాటు టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ హ్యాపి వెడ్డింగ్ అందుకుందా..? నిహారిక, సుమంత్ అశ్విన్‌ల కెరీర్లకు ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుంది..? కథ ; ఇది విజయవాడ అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయిల పెళ్లి కథ. విజయవాడలో ఉండే గోపాల్ (నరేష్), లలిత(పవిత్రా లోకేష్)ల అబ్బాయి ఆనంద్ విరాట్ వాకలపూడి (సుమంత్ అశ్విన్). యాడ్ ఫిలింకు మేకర్ అయిన ఆనంద్‌ది మెచ్యూర్డ్ గా ఆలోచించే మనస్థత్వం. హైదరాబాద్‌లో ఉండే హనుమంతరావు (మురళీ శర్మ), లత(తులసి)ల అమ్మాయి అక్షర (నిహారిక కొణిదెల). డిజైనర్ గా పనిచేసే అక్షరది ఏ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోలేని చంచల మనస్థత్వం. (సాక్షి రివ్యూస్) ఓ బస్సు ప్రయాణంలో ప్రేమలో పడిన వీరిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. కానీ ఆనంద్ చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా అక్షర పెళ్లి విషయంలో ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో తను గతంలో ప్రేమించిన విజయ్ (రాజా) మరోసారి తన జీవితంలోకి రావటంతో.. ఆనంద్‌ను పెళ్లి చేసుకోవాలా.. వద్దా..? అన్న సందిగ్థంలో పడిపోతుంది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు ఎలా రియాక్ట్ అయ్యాయి..? చిరవకు అక్షర, ఆనంద్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయవాడ అబ్బాయిగా సుమంత్ అశ్విన్, హైదరాబాద్ అమ్మాయిగా నిహారికలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. లవర్ బాయ్ రోల్స్ లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సుమత్ అశ్విన్, మరోసారి అదే తరహా పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో సుమంత్ అశ్విన్ నటన సూపర్బ్. ఒక్కమనసు సినిమాతో నిరాశపరిచిన నిహారికకు ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. (సాక్షి రివ్యూస్)పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో పరవాలేదనిపించారు. సీనియర్ నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, ఇంద్రజ, రాజాలు రొటీన్ పాత్రల్లో కనిపించారు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; తెలుగు తెర మీద పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఘన విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే బాటలో హ్యాపి వెడ్డింగ్ సినిమాతో మరో అందమైన ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు లక్ష్మణ్. పెళ్లి ఇంట్లో ఉండే హడావిడి, కుటుంబ బంధాలను బలంగా చూపించిన దర్శకుడు, హీరో హీరోయిన్ల మధ్య గొడవకు కారణాన్ని మాత్రం అంత బలంగా తయారు చేసుకోలేదు. చిన్న విషయానికి హీరోయిన్ పెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం సిల్లీగా అనిపిస్తుంది. అదే సమయంలో కథనం కూడా నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్)సినిమాకు ప్రధాన బలం సంగీతం. శక్తికాంత్ కార్తీక్ అందించి పాటలు బాగున్నాయి. పాటలు కావాలని ఇరికించినట్టుగా కాకుండా కథలో భాగంగా వచ్చి వెలుతూ అలరిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ ; నెమ్మదిగా సాగే కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి
‘‘నిజాయితీగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలన్నది నా అభిప్రాయం. ఫ్రెండ్స్ లిస్ట్‌లో అమ్మాయిలు ఉన్నారు కానీ ఇప్పటి వరకైతే నేను ఎవర్నీ లవ్ చేయలేదు. ఏదో ఒక టైమ్‌లో అందరికీ కచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నా టైమ్ వచ్చినప్పుడు నాకు జరుగుతుంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ చెప్పిన విశేషాలు.. ► డైరెక్టర్ లక్ష్మణ్‌గారు కథ చెప్పినప్పుడు చివరి 20 నిమిషాల్లో వచ్చే డైలాగ్స్, సన్నివేశాలు నచ్చి సినిమా ఒప్పుకున్నాను. రొమాన్స్, డ్రామా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. పెళ్లి వాతావరణంలో సినిమా కథనం సాగుతుంది. ఇందులో ఆనంద్ పాత్ర చేశా. ► అవుట్‌పుట్ కూడా బాగా వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మా సినిమాలో విలన్ ఎవరు? అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఈ సినిమా వల్ల కుటుంబ ఆప్యాయతలు, అనుబంధాలులపై మరింత అవగాహన పెంచుకున్నాను. ► కథానాయికగా నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు అన్నారు. నిహారిక చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్లో ఆమె చేసిన యాక్టింగ్ సినిమాలో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సినిమాలో నా క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందా లేక నిహారిక పాత్ర ఎక్కువ ఉంటుందా? అనే లెక్కలు వేసుకోలేదు. ఇద్దరి క్యారెక్టర్స్‌కు సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది. ► ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో నేనూ పెద్ద బ్యానర్లో చేయడానికి ఇదొక ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్ వారు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వాళ్లు లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్‌గా వచ్చేది కాదు. ► నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మా తల్లిదండ్రులకు ఇష్టమే. కానీ ఆ అమ్మాయి మా అమ్మానాన్నలకు నచ్చాలనేది నా ఫీలింగ్. వాళ్లకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటాను. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ కాదనరని నా నమ్మకం. -
అప్పుడు సినిమాలు మానేస్తాను
‘‘మంచి పాత్రలు చేస్తే మంచి నటిగా గుర్తుండిపోతావు. చిన్న తప్పు చేసినా.. భూతద్దంలో పెట్టి చూస్తారు. వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి’ అని సినిమాల్లోకి వచ్చే ముందు పెదనాన్న (చిరంజీవి) చెప్పారు’’ అన్నారు నిహారిక. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిహారిక పంచుకున్న విశేషాలు... ► ‘‘హీరోలతో బయటి అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడితేనే ఏదేదో అంటుంటారు. నువ్వు మెగా ఫ్యామిలీ నుంచి వెళుతున్నావంటే నీపై కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు నార్మల్‌గా కనిపించినా ఏదేదో రాసేస్తారు’’ అని నాన్న (నాగబాబు) అన్నారు. ప్రస్తుతం నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. సోషల్ మీడియాతో సమయం వృథా అని రెండేళ్లు ఫోన్ వాడలేదు. మళ్లీ ఈ మధ్యే వాడుతున్నాను. ► ‘హ్యాపి వెడ్డింగ్’లో అక్షర అనే సింపుల్ ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో కనిపిస్తా. ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోవాళ్ల సమ్మతంతో ఎంగేజ్మెంట్, పెళ్లి జరుగుతుంది. నా పాత్రవల్లే సమస్యలు, సొల్యూషన్స్ ఉంటాయి. ► చిరంజీవిగారి డ్యాన్స్ చూస్తూ పెరగడంతో నేర్చుకోవాల్సిన పని లేదనిపించింది. డ్యాన్స్ బాగా వచ్చినప్పటికీ నా మూడు సినిమాల్లో చేసే అవకాశం రాలేదు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే క్రమంలో కాళ్లపై కొట్టి నేర్పిస్తారు (నవ్వుతూ). అలా చేయడం వల్ల నాకు జ్వరం వచ్చి నేర్చుకోవడమే మానేశాను. ► నాకు 10–15 ఏళ్లు సినిమాల్లో నటించాలని లేదు. మూడు నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు మానేస్తాను. అయితే ప్రొడక్షన్ సైడ్ ఉంటాను. వెబ్ సిరీస్ చేసుకుంటాను. సినిమాలు మానేసిన తర్వాత నా సినిమాలు చూసుకుంటే నా ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చాలి. స్టార్ హీరోలతో ఇప్పటి వరకూ అవకాశం రాలేదు.. వస్తే చేస్తా. ► పెళ్లంటే చాలా గౌరవం. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోను. ప్రస్తుతం నా దృష్టి కెరీర్‌పైనే. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌లతో సినిమా చేసేటప్పుడు ట్యూటర్ని పెట్టుకుని తమిళం నేర్చుకున్నా. ఇప్పుడు రాస్తాను కూడా. ఇంట్లో నేనెవర్నీ ఇమిటేట్ చేయను. ► మెగా ప్రిన్సెస్ అన్నప్పుడల్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనిపిస్తుంది. దానివల్ల కొన్నిసార్లు మంచే జరిగినా నాకు భయంగా ఉంటుంది. ‘కథ నీకు నచ్చితే చెయ్’ అని అన్నయ్య (వరుణ్ తేజ్) అంటారు. నా సినిమా కథ వినరు. ప్రణీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశాం. రాహుల్ విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నా. ∙చిరంజీవిగారి సినిమాలో ఆయనతో ఓ ఫ్రేమ్‌లో కనిపించినా చాలనుకునేదాన్ని. ‘సైరా’లో నటించాలని అన్నయ్య చరణ్‌ను బతిమలాడాను. సురేందర్‌రెడ్డిగారు వచ్చి ‘డైలాగ్స్ లేకున్నా పర్లేదా?’ అంటే.. ఓకే అన్నా. రెండు ఫ్రేమ్స్‌లో కనపడే చిన్న బోయ అమ్మాయిగా చేశా. -
‘హ్యాపి వెడ్డింగ్’ మూవీ స్టిల్స్
-
‘హ్యాపి వెడ్డింగ్’ ప్రీ–రిలీజ్ వేడుక
-
నాన్నగారికి రాజుగారు అప్పు ఇచ్చారు
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రిస్క్. ఆ రిస్క్ తీసుకోవడానికి యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు ఎప్పుడూ ముందుంటారు. కానీ తెరవెనుక నుంచే మొత్తం నడుపుతారు. రిస్క్, రివార్డులు తీసుకునే వాళ్లలో ‘బాహుబలి’ నిర్మాతలు (శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని) తర్వాత వీరినే అనుకుంటా. గుండె ధైర్యంతో పాటు చాలా పెద్ద మనసున్న మంచివాళ్లు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిహారిక మా ముందు పుట్టి పెరిగి మామయ్యా.. అంటుండేది. ఇవాళ హీరోయిన్గా చూస్తుంటే నాకు డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. సుమంత్ అశ్విన్ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ యాక్టర్. టీనేజ్‌కి కొంచెం పైబడినట్టు ఉండి రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయగల తక్కువ మంది హీరోల్లో సుమంత్ ఒక్కరు. ఎమ్మెస్ రాజుగారితో పోటీ పడి పైకొచ్చాం. అంత మంచి నిర్మాత ఆయన. ఇటీవల ఓ సినిమాలో మురళీశర్మగారి నటన చూశాక ఎస్వీ రంగారావుగారి అవార్డు ఉంటే ఇవ్వాలనిపించింది. అంత బాగా చేశారు. ‘సమ్మోహనం’ సినిమా చూసి నరేశ్‌ని అభినందిస్తూ మెసేజ్ చేశా. ‘హ్యాపి వెడ్డింగ్’ ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలనుకునే సినిమాల్లో ఇదొకటి’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘నిహారిక కోసమో, ఈ సినిమా గురించి మాట్లాడటానికో ఇక్కడికి రాలేదు. ఎమ్మెస్ రాజుగారి కోసం వచ్చా. ఆయన, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. వంశీ అన్న, విక్రమ్, ప్రమోద్గారు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. వారిపై నమ్మకంతో, నిహారిక మాటలు విన్నాక, ట్రైలర్ చూశాక కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ పండితే సినిమా కూడా పండుతుందని చాలా వరకు నేను నమ్ముతా. మురళీశర్మగారితో ‘ఎవడు’ సినిమా చేశా. త్వరలో మరో సినిమా చేయాలనుకుంటున్నా. సుమంత్ వెరీ హార్డ్‌వర్కర్. తన కెరీర్‌కి ఇది మైల్స్టోన్ అవుతుంది. ఎమ్మెస్ రాజుగారితో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. నెలక్రితం నాన్నగారు (చిరంజీవి), నేను కూర్చుని ఉన్నప్పుడు రాజుగారి టాపిక్ వచ్చింది. నాన్నగారు 1980లలో జరిగిన ఓ సంఘటన చెప్పారు. నాన్నగారు చాలా మంది నిర్మాతలతో పని చేస్తూ ఉండేవారు. ఓ నెల నాన్నకీ, అమ్మకీ డబ్బులు సరిపోలేదు. నాన్నగారు హీరోగా పని చేస్తున్న ఓ ముగ్గురు నిర్మాతలను ఐదు వేలు అప్పు అడిగితే వాళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. చివరిగా ఎమ్మెస్ రాజుగారి నాన్నగార్ని (అయ్యప్పరాజు) అడిగినప్పుడు.. ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఐదు వేల రూపాయలు నాన్నగారికి ఇచ్చి తీసుకో.. తర్వాత తీసుకుంటాను అన్నారట ఎమ్మెస్ రాజుగారు. తర్వాత నాన్న తిరిగిచ్చేశారు. అది ఇవాళ్టికి కూడా గుర్తుపెట్టుకుని నాన్నగారు నాకు చెప్పారు. ఎమ్మెస్ రాజుగారు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ గురించి చెప్పగానే అది నా బాధ్యత.. వస్తాను అన్నాను. ఇక్కడికి నేను రావడం గొప్ప విషయం కాదు. ఆయన గొప్పతనం మీ అందరికీ చెప్పాలనే ఇక్కడికొచ్చా. నటుడికి, నిర్మాతకి, డైరెక్టర్‌కి కావాల్సింది ప్రతిభే కాదు మంచి ప్రవర్తన. గ్రేట్ టాలెంట్ ఉన్నవారు బ్యాడ్ యాటిట్యూడ్‌తో ఉంటే సక్సెస్ అవలేరు కానీ, బ్యాడ్ టాలెంట్ ఉన్నా ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే ఎప్పటికైనా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అలాంటి రాజుగారి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలని మా ఫ్యామిలీ తరఫునుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘హ్యాపి వెడ్డింగ్’ వెరీ గుడ్ టైటిల్. చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ సినిమా ‘బొమ్మరిల్లు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు డైరెక్టర్ బి. గోపాల్. ‘‘నా దృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలో బిగ్గెస్ట్ ఫంక్షన్ పెళ్లి. ఆ ఈవెంట్ ఓ ఎమోషనల్ ప్యాకేజ్.. అదే మా ‘హ్యాపి వెడ్డింగ్’. ఈ సినిమా ఫీల్‌ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళతారని చెప్పగలను. సుమంత్, నిహారికగార్ల సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చాలా కష్టం’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘హ్యాపి వెడ్డింగ్’ కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యి ఓకే చేశా. ఈ కథకి అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు. వంశీ, ప్రమోద్గారు లక్కున్న నిర్మాతలు. ఆ లక్ మాకూ వస్తుందనుకుంటున్నా’’ అన్నారు నిహారిక. ‘‘ఈ సినిమాలో కొన్ని సీన్లకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. అవి స్వీట్ మెమొరీస్. వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రేక్షకులే దేవుళ్లు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి’’ అన్నారు సుమంత్ అశ్విన్. -
నెలాఖర్లో పెళ్లి
పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వరుడు సుమంత్ అశ్విన్. వధువు నిహారిక. ఈ నెల 28న వీరి వివాహం జరగనుంది. ఇది రీల్ మ్యారేజ్. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది. లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ – ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట. జీవించినంత కాలం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి మనస్పర్థలు రాకుండా జీవించాలని అర్థం. దీనికి ఇరు పెద్దలు కూర్చుని చక్కటి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పెళ్లికి ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చూపించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, రీ రికార్డింగ్: తమన్, కెమెరా: బాల్ రెడ్డి. -
హ్యాపీ వెడ్డింగ్ : సంగీత్ కంటిన్యూస్
మెగా వారసురాలు నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు. సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీద ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. రేపు తొలి సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘దీంతన.. తోంతన..’ అంటూ సాగే ఓ ఫంక్షన్ సాంగ్‌ను రేపు (గురువారం) ఉదయం రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మావాడికి పెళ్లి కుదిరింది
‘మాకు బంధువులు ఎక్కువేగానీ పనులకు ఎవరూ రారు’ అనే డైలాగ్‌తో ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. ‘మీ అబ్బాయిలంతా ఇంతేనా.. మేం కన్ఫామ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు’ అంటూ సుమంత్ అశ్విన్‌ని నిలదీస్తున్నారు నిహారిక. ‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. ఏం చేసినా చాలా రొమాంటిక్‌గా చేస్తారు’ అని నిహారికతో అంటున్నారు సుమంత్ అశ్విన్. టోటల్‌గా ‘హ్యాపి వెడ్డింగ్’ ట్రైలర్లో పెళ్లి సందడి కనిపించింది. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని అందంగా చూపించాం. ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘నిహారిక బాగా నటించారు. నా కెరీర్‌కి ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘యూవీ క్రియేషన్స్‌లో మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు నిహారిక. ఈ సినిమాకు సమర్పణ: యూవీ క్రియేషన్స్, సంగీతం: శక్తికాంత్, రీ–రికార్డింగ్: ఎస్.ఎస్. తమన్, కెమెరా: బాల్‌రెడ్డి, నిర్మాత: పాకెట్ సినిమా. -
‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్’
ఒక్కమనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మెగా వారసురాలు నిహారిక కొణిదెల తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన నిహారిక త్వరలో హ్యాపీ వెడ్డింగ్సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు. యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ డిఫరెంట్ వీడియోతో నిహారిక ఆకట్టుకోగా చిత్ర ట్రైలర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రిలీజ్ చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. -
హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ విడుదల
-
నా పెళ్లి గురించి మీకెందుకు : నిహారిక
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూవీ క్రియేషన్స్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఓ వ్యక్తి మేడమ్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీనిపై ఏమైనా చెబుతారా అని అడగగా.. నిహారిక స్పందిస్తూ.. ‘అసలు ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా.. నిహారిక ఎవర్ని చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకుంటుంది,ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్ అవుతారు.. షేక్ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా’ అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. తర్వాత అతడు మేము అడుగుతుంది మీ హ్యాపి వెడ్డింగ్ మూవీ గురించి మేడమ్ అని చెప్పగా.. నిహారిక సారీ చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. హ్యాపి వెడ్డింగ్ ట్రైలర్ జూన్ 30న రిలీజ్ కాబోతుందన్నారు. అప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతామంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. హ్యాపి వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కోసం రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేయనున్నారు. -
నా పెళ్లి గురించి మీకెందుకు..?
-
సుమంత్ అశ్విన్, నిహారికల ‘హ్యాపి వెడ్డింగ్’ టీజర్ విడుదల
-
‘హ్యాపి వెడ్డింగ్’.. ఫస్ట్ ఇన్విటేషన్
‘తూనీగ తూనీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చా రు స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత లాంటి విజయవంతమైన చిత్రాలు అతని ఖాతాలో ఉన్నప్పటికీ గత కొంతకాలం పాటు సరైన హిట్‌లేక వెనుకబడ్డారు. అయితే ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ‘ఫస్ట్ ఇన్విటేషన్’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గా నటిస్తున్నారు. ‘ఒక మనసు’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నిహారిక. కమర్షియల్‌గా ఆ సినిమా విజయవంతం కాకపోయినా నటన పరంగా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత మళ్లీ తెలుగులో ఇంకో సినిమా చేయలేదు. తమిళంలో విజయ్‌సేతుపతితో కలిసి ఓ సినిమా చేసినా, అది తెలుగులో విడుదల కాలేదు. అయితే ఈ ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమా నిహారికకు, సుమంత్‌కు విజయం అందిస్తుందో లేదో వేచి చూడాలి. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. Wedding shenanigans begin💍@UV_Creations & #PocketCinema cordially invites you to the #HappyWedding of #SumanthAshwin @IamNiharikaK. With best compliments from @lakshmankarya Sangeet by #ShakthiKarthik & @musicthaman 🎶#HappyWeddingFirstInvitationhttps://t.co/ro4nifDBex — UV Creations (@UV_Creations) June 21, 2018 -
పెళ్లి కుదిరాక...
‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే వరకూ రెండు కుటుంబాల మనసుల్లో ఏం జరుగుతుందో మా సినిమాలో చూపించాం’’ అంటున్నారు ‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రబృందం. సుమంత్ అశ్విన్, నిహారికా జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తమన్ రీ–రీకార్డింగ్ చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో కలసి ఈ సినిమా చేస్తున్నాం. లక్ష్మణ్ విజన్ ఉన్న దర్శకుడు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి తమన్ ఎంటర్ అయ్యారు. తనదైన రీ–రికార్డింగ్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నారు. త్వరలోనే సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
వేసవిలో వెడ్డింగ్
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పెళ్లి కుదిరిన రోజు నుంచి జరిగే వరకూ ఉన్న టైమ్‌లో రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని లక్ష్మణ్ చక్కగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం జరిగి ఉంటుంది. ఆయా పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది. సుమంత్ అశ్విన్, నిహారిక చక్కగా నటించారు. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ మా సినిమాకి పాటలు అందించారు. త్వరలోనే టీజర్‌ని రిలీజ్ చేస్తాం. ఈ సమ్మర్‌కి చక్కని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. నరేశ్, మురళీ శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
మెగా డాటర్ 'హ్యాపీ వెడ్డింగ్'
స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన భామ నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ భామ ముందు యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి.. తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది. అయితే తొలి సినిమా నిరాశపరచటంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న నిహారిక తన రెండో సినిమా ను గత జూన్ లో ప్రారంభించింది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించనుంది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది.