సుమంత్ అశ్విన్
‘‘నిజాయితీగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలన్నది నా అభిప్రాయం. ఫ్రెండ్స్ లిస్ట్‌లో అమ్మాయిలు ఉన్నారు కానీ ఇప్పటి వరకైతే నేను ఎవర్నీ లవ్ చేయలేదు. ఏదో ఒక టైమ్‌లో అందరికీ కచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నా టైమ్ వచ్చినప్పుడు నాకు జరుగుతుంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ చెప్పిన విశేషాలు..
► డైరెక్టర్ లక్ష్మణ్‌గారు కథ చెప్పినప్పుడు చివరి 20 నిమిషాల్లో వచ్చే డైలాగ్స్, సన్నివేశాలు నచ్చి సినిమా ఒప్పుకున్నాను. రొమాన్స్, డ్రామా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. పెళ్లి వాతావరణంలో సినిమా కథనం సాగుతుంది. ఇందులో ఆనంద్ పాత్ర చేశా.
► అవుట్‌పుట్ కూడా బాగా వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మా సినిమాలో విలన్ ఎవరు? అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఈ సినిమా వల్ల కుటుంబ ఆప్యాయతలు, అనుబంధాలులపై మరింత అవగాహన పెంచుకున్నాను.
► కథానాయికగా నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు అన్నారు. నిహారిక చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్‌లో ఆమె చేసిన యాక్టింగ్ సినిమాలో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సినిమాలో నా క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందా లేక నిహారిక పాత్ర ఎక్కువ ఉంటుందా? అనే లెక్కలు వేసుకోలేదు. ఇద్దరి క్యారెక్టర్స్‌కు సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది.
► ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో నేనూ పెద్ద బ్యానర్‌లో చేయడానికి ఇదొక ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్ వారు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వాళ్లు లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్‌గా వచ్చేది కాదు.
► నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మా తల్లిదండ్రులకు ఇష్టమే. కానీ ఆ అమ్మాయి మా అమ్మానాన్నలకు నచ్చాలనేది నా ఫీలింగ్. వాళ్లకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటాను. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ కాదనరని నా నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment