నా పెళ్లి గురించి మీకెందుకు : నిహారిక | Niharika In Happy Wedding Movie Promotional Video | Sakshi
Sakshi News home page

నా పెళ్లి గురించి మీకెందుకు : నిహారిక

Published Thu, Jun 28 2018 12:13 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

Niharika In Happy Wedding Movie Promotional Video - Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వార్తలపై ఫైర్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూవీ క్రియేషన్స్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. ఓ వ్యక్తి మేడమ్‌ మేము యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.. దీనిపై ఏమైనా చెబుతారా అని అడగగా.. నిహారిక స్పందిస్తూ.. ‘అసలు ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా.. నిహారిక ఎవర్ని చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకుంటుంది,ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్‌ అవుతారు.. షేక్‌ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంబ్‌ నెయిల్స్‌ కోసం నన్ను వాడుకుంటారా’ అంటూ అతనిపై విరుచుకుపడ్డారు.
 
తర్వాత అతడు మేము అడుగుతుంది మీ హ్యాపి వెడ్డింగ్‌ మూవీ గురించి మేడమ్‌ అని చెప్పగా.. నిహారిక సారీ చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. హ్యాపి వెడ్డింగ్‌ ట్రైలర్‌ జూన్‌ 30న రిలీజ్‌ కాబోతుందన్నారు. అప్పుడు సినిమా రిలీజ్‌ ఎప్పుడో చెబుతామంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. హ్యాపి వెడ్డింగ్‌ చిత్ర ప్రమోషన్‌ కోసం రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రంలో సుమంత్‌ అశ్విన్‌, నిహారిక జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement