
స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన భామ నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ భామ ముందు యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి.. తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది. అయితే తొలి సినిమా నిరాశపరచటంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న నిహారిక తన రెండో సినిమా ను గత జూన్ లో ప్రారంభించింది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించనుంది.
సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది.