కొత్త సినిమాకు... రైట్ రైట్
యూత్ మాత్రమే కాదు... ఫ్యామిలీస్ కూడా మెచ్చే ప్రేమకథా చిత్రాలు చేస్తూ సుమంత్ అశ్విన్ అందరికీ దగ్గరయ్యాడు. ‘లవర్స్’, ‘కేరింత’, ‘కొలంబస్’... ఇలా వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ యువహీరో తాజాగా ‘రైట్ రైట్’ అనే చిత్రం అంగీకరించారు. నూతన దర్శకుడు మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబరు 7న ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఒక మలయాళ సూపర్‌హిట్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటి వరకూ సుమంత్ అశ్విన్ చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులోని పాత్ర ఉంటుంది.
‘బాహుబలి’లో విలన్‌గా భయపెట్టిన ప్రభాకర్ ఓ కీలక పాత్రలో నవ్వించ నున్నారు. విజయనగరం, అరకు పరిసర ప్రాంతాల్లో జరిగే సింగిల్ షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, ఛాయాగ్రహణం: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు.