
ప్రేమాన్వేషణ!
ఈ రెండేళ్లలో సుమంత్ అశ్విన్ నటించిన నాలుగు చిత్రాల్లో మూడు హిట్. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘కొలంబస్’ ఆ విజయ పరంపరను కొనసాగిస్తుందనే
ఈ రెండేళ్లలో సుమంత్ అశ్విన్ నటించిన నాలుగు చిత్రాల్లో మూడు హిట్. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘కొలంబస్’ ఆ విజయ పరంపరను కొనసాగిస్తుందనే నమ్మకంతో ఉన్నారాయన. ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డిస్కవరీ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా ఆర్. సామల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ప్రేమాన్వేషణ సాగించే ఓ కుర్రాడి కథ ఇది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 90 శాతం సినిమా పూర్తయ్యింది.
ఈ నెల 25న చివరి షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ‘‘ఇందులో సుమంత్ అశ్విన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతున్న తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం. మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని నిర్మాత చెప్పారు. చివరి షెడ్యూల్‌లో ఒక ఛేజ్, ఒక ఫైట్, ఓ పాట చిత్రీరిస్తామని, ఆగస్ట్‌లో పాటలను, సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి.