సున్నితమైన ప్రేమకథ | Sumanth Ashwin is currently playing another love story | Sakshi
Sakshi News home page

సున్నితమైన ప్రేమకథ

Published Fri, Apr 25 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

సున్నితమైన ప్రేమకథ

సున్నితమైన ప్రేమకథ

 ‘అంతకు ముందు  ఆ తరువాత’లో పరిణతి చెందిన నటన కనబర్చిన సుమంత్ అశ్విన్ ప్రస్తుతం మరో ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. మహి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సీహెచ్ నరసింహాచారి, ఇలవల నరసింహారెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత వేమారెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘అన్ని వర్గాలవారిని అలరించే సున్నితమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. వినోద ప్రధానంగా సాగే సినిమా. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు హీరో, హీరోయిన్ పాల్గొనగా ఓ పాట కూడా చిత్రీకరిస్తాం. మే 5 వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. మిక్కీ జె మేయర్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement