చాలా ఉద్వేగంగా ఉంది! | Chakkiligintha Movie Release On Dec 5th | Sakshi
Sakshi News home page

చాలా ఉద్వేగంగా ఉంది!

Published Sat, Nov 29 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

చాలా ఉద్వేగంగా ఉంది!

చాలా ఉద్వేగంగా ఉంది!

 ‘‘వేమారెడ్డిగారు ఈ చిత్రకథ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ చేసినప్పుడు, విడుదలకు సిద్ధమయ్యాక అదే ఫీలింగ్ ఉంది. వేమారెడ్డిగారికి పెద్ద హీరోల నుంచి ఫోన్స్ వస్తున్నాయని విన్నాను. ఆనందంగా ఉంది’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, రెహానా జంటగా సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన ‘చక్కిలిగింత’. డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంతో సుమంత్ అశ్విన్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం’’ అని చెప్పారు.
 
 నరసింహాచారి మాట్లాడుతూ -‘‘నా జీవితంలో వచ్చిన మంచి మార్పులన్నీ డిసెంబర్ 5న జరిగినవే. ఇప్పుడీ చిత్రం అదే తేదీన విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్ స్వర పరచిన పాటలకు ఆదరణ లభించినట్లుగానే, ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. వేమారెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ కథ వినగానే ఎమ్మెస్ రాజుగారు అంగీకరించారు. అలాగే, నైజాం ఏరియాలో విడుదల చేస్తానని మొదట్నుంచీ ‘దిల్’ రాజుగారు అనేవారు’’ అన్నారు. ఈ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలొస్తాయనే నమ్మకముందని మాటల రచయిత జయంత్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement