
∙సుమంత్ అశ్విన్
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా, సలోని మిశ్రా కథానాయికగా తెరకెక్కుతోన్న చిత్రం ‘18+ సినిమా’. ‘దండుపాళ్యం 1, 2, 3’ చిత్రాల తర్వాత శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరాజు, ఎం.కోటేశ్వరరాజు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ తమిళనాడులోని తిరువల్లూరులో వేసిన సెట్‌లో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మకరంద్ దేశ్‌పాండే, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
Comments
Please login to add a commentAdd a comment