
భీమ్స్, దామోదర్ రెడ్డి, రాజీవ్ కనకాల, సంజయ్, సుమంత్, విశ్వంత్, పల్లక్
విశ్వంత్ , పల్లక్ లల్వాని జంటగా సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌పై బాపిరాజు ఈ సినిమా విడుదల చేస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హీరో సుమంత్ అశ్విన్, నిర్మాత దామోదర్ రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు సంజయ్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘కుటుంబంతో కలిసి చూసే చక్కటి వినోదాత్మక చిత్రమిది. షూటింగ్ అంతా హ్యాపీగా జరిగింది. మా హీరో విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పల్లక్ లల్వాని చాలా బాగా నటించారు.
నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చిన నిర్మాత మధుగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. ‘‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’తో కేరింత పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది’’ అని నటుడు రాజీవ్ కనకాల అన్నారు. విశ్వంత్ మాట్లాడుతూ– ‘‘నేను ఫస్ట్ డే కథ విన్నప్పటి నుంచి మిస్ కమ్యూనికేషన్ లేకుండా సంజయ్ చేశాడు. ఆయనకు పెద్ద బ్రేక్ రావాలి. నా సినిమా ఏడాది తర్వాత రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ అవ్వాలి. గతంలో నేను చేసిన ‘కేరింత, మనమంతా’ సినిమాలు ఎక్కువ డ్రామాతో కూడుకున్నవి. తొలిసారి కామెడీ చేశా. వినోదం పంచడం చాలా కష్టం. కానీ అది నాకు ఈజీ అయ్యిందంటే కారణం మా డైరెక్టర్’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment