అవకాశమొస్తే హిందీలో కూడా చేస్తా! | when opportunity comes, i am acting in hindi also | Sakshi
Sakshi News home page

అవకాశమొస్తే హిందీలో కూడా చేస్తా!

Aug 20 2014 12:30 AM | Updated on Sep 2 2017 12:07 PM

అవకాశమొస్తే  హిందీలో కూడా చేస్తా!

అవకాశమొస్తే హిందీలో కూడా చేస్తా!

‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. గ్లామర్ రంగంలో అయితే... మరీనూ. అందునా విజయంలో ఉన్నవారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే...

‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. గ్లామర్ రంగంలో అయితే... మరీనూ. అందునా విజయంలో ఉన్నవారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే... జాగ్రత్తగా పాత్రలను ఎన్నుకుంటూ ముందుకెళ్తున్నాను’’ అని నందిత అన్నారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవర్స్’. మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమాకు మంచి స్పందన లభిస్తోందని నందిత ఆనందం వెలిబుచ్చారు.
 
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ ‘‘మేం అనుకున్న దానికంటే ‘లవర్స్’కి మంచి స్పందన లభిస్తోంది. సుమంత్ అశ్విన్ సెటిల్డ్‌గా నటించాడు. సప్తగిరి, సాయి కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది’’ అని చెప్పారు నందిత. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావడమే తన లక్ష్యమని, దాని కోసం ఏ తరహా పాత్ర చేయడానికైనా సిద్ధమని నందిత చెప్పారు. తెలుగుతో పాటు, తమిళ , మలయాళ భాషల్లో కూడా నటిస్తున్నానని, అవకాశం వస్తే బాలీవుడ్‌లో చేయడానికి కూడా సిద్ధమేనని నందిత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement