విభిన్న కథలో సుమంత్ అశ్విన్ | A different story   Sumanth Ashwin | Sakshi
Sakshi News home page

విభిన్న కథలో సుమంత్ అశ్విన్

Published Fri, Mar 14 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

విభిన్న కథలో  సుమంత్ అశ్విన్

విభిన్న కథలో సుమంత్ అశ్విన్

సుమంత్ అశ్విన్ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందుతోంది. వేమారెడ్డి దర్శకుడు. సీహెచ్ నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవాల నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూ ర్తపు దృశ్యానికి దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, సుకుమార్ క్లాప్ ఇచ్చారు.

వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకునిగా తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలని, ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని వేమారెడ్డి తెలిపారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని సుమంత్ అశ్విన్ చెప్పారు. అడగ్గానే సుమంత్ డేట్స్ ఇచ్చి తమను ప్రోత్సహించిన ఎమ్మెస్‌రాజుగారికి కృతజ్ఞతలని,

‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలా... ఈ సినిమా కూడా సుమంత్‌కి మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. తాగుబోతు రమేష్, వివా హర్ష, తులసి, అంబటి శ్రీను, జోష్ రవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: ఏఎస్ ప్రకాష్, రచనా సహకారం: టి.మధుసూదన్, జయంత్, నిర్మాణం: మహి ఎంటర్‌టైన్‌మెంట్స్.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement