'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ | feel my love title registerd for devi sri debut film | Sakshi
Sakshi News home page

'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ

Published Tue, Dec 1 2015 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ

'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ

చాలా రోజులుగా టాలీవుడ్ లో షికారు చేస్తున్న ఓ వార్త త్వరలో నిజం కాబోతుంది. ఎనర్జిటిక్ మ్యూజిక్ తో పాటు అదే స్థాయిలో స్టేజ్ పర్ఫార్మెన్సులతోనూ ఇరగదీసే స్వర సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంగా కుమారి 21 ఎఫ్‌ సక్సెస్ మీట్ వేదికగా నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు అదే స్పీడులో ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన దిల్ రాజు. తాజా దిల్ రాజు ఫీల్ మై లవ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో దేవీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇదే అన్న టాక్ మొదలైంది. దేవీ శ్రీ సంగీతం అందించిన సూపర్ హిట్ సినిమా ఆర్యలోని ఓ పాట పల్లవినే రిజిస్టర్ చేయించటంతో ఇదే దేవీ శ్రీ హీరోగా తెరకెక్కే సినిమాకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement