ప్రేమలో కొత్త యాంగిల్‌ని చూపించిన చిత్రం ‘ఆర్య’ (2004). అల్లు అర్జున్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంతో సుకుమార్ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా పాటలతో కెరీర్‌లో మంచి మైలేజ్ పొందారు దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా విడుదలై 15ఏళ్లు ముగిసింది. ఈ విషయంపై అల్లు అర్జున్ స్పందిస్తూ– ‘‘ఆర్య’ సినిమా ఫీల్‌ని ఇంకా ఆస్వాదిస్తున్నాను. నా లైఫ్‌లో మోస్ట్ మ్యాజికల్ ఫిల్మ్ ఇది. నా జీవితాన్ని మార్చేసిన ‘ఆర్య’ సినిమా రిలీజై 15ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకున్నాను.
సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, ‘దిల్’ రాజుగారు.. ఇలా టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మెచ్చిన ప్రేక్షకులను మరచిపోలేను’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘15ఏళ్ల క్రితం ఇదే రోజున (మే 7) ‘ఆర్య’ సినిమా విడుదలై నాకు, బన్నీ (అల్లు అర్జున్), సుకుమార్‌కి మంచి విజయాన్ని అందించింది. అల్లు అర్జున్‌తో నాలుగో సినిమా చేయబోతున్నాను’’ అని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. బన్నీ–‘దిల్’ రాజు కాంబినేషన్‌లో ఆర్య, పరుగు, డీజే చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగో సినిమా టైటిల్ ‘ఐకాన్’. వేణు శ్రీరామ్ దర్శకుడు.
నా జీవితాన్ని మార్చేసింది
Published Wed, May 8 2019 1:21 AM | Last Updated on Wed, May 8 2019 1:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment