ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్ | Allu Arjun Shares Experience After Arya Movie Release Talk In Arya 20 Years Celebrations | Sakshi
Sakshi News home page

Allu Arjun: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది

Published Wed, May 8 2024 11:41 AM | Last Updated on Wed, May 8 2024 12:54 PM

Allu Arjun Shares Experience After Arya Movie Release Talk

ఐకాన్ ‍స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్‌ 20 ఏళ్ల సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్‌, అల్లు అరవింద్, దిల్‌రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్‌ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్‌. రిలీజ్‌ రోజు నేను, సుకుమార్‌ థియేటర్‌కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్‌ మెల్ల మెల్లగా ఫిల్‌ ‍అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్‌ ఉంది.  తీరా ఆ రోజు రిపోర్ట్‌ చూస్తే మాత్రం 10 వీక్స్‌ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్‌ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్‌కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్..  పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్‌?..125 డేస్ షీల్డ్‌ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్‌ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement