ట్రైలర్ మాత్రమే కాదు.. సాంగ్‌ కూడా ఊపేస్తోంది! | Allu Arjun's Kissik Song Gets Million Views With In Just 18 Hours | Sakshi
Sakshi News home page

Pushpa 2 Kissik Song: పుష్ప -2 కిస్సిక్ సాంగ్‌.. 18 గంటల్లోనే రికార్డ్!

Nov 25 2024 3:53 PM | Updated on Nov 25 2024 4:02 PM

Allu Arjun's Kissik Song Gets Million Views With In Just 18 Hours

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు మరో ఊపు సాంగ్ వచ్చేసింది. పుష్ప-2 నుంచి కిస్సిక్ అంటూ శ్రీలీల డ్యాన్స్ చేసిన ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో ఈ లిరికల్ పాటను విడుదల చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ మరో అదిరిపోయే సాంగ్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే కిస్సిక్ సాంగ్‌ క్రేజీ రికార్డ్ సాధించింది.

ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాకుండా సౌత్‌ ఇండియాలో ఏ సాంగ్‌ సాధించని రికార్డ్‌ సృష్టించింది. కేవలం 18 గంటల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సైతం యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబోలో వస్తోన్న ఈ మూవీ మర పది రోజుల్లోనే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 ది ‍రూల్‌ విడుదలవుతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో టికెట్ బుకింగ్స్ ఒపెనవ్వగా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ పూర్తయ్యాయి. యూఎస్‌లో ఎప్పుడు లేని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement