
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమొరీస్’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసుకున్నాడు.

20 ఏళ్ల సెలబ్రేషన్స్
ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య టీమ్ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig
— Allu Arjun (@alluarjun) May 7, 2024
Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB
— Allu Arjun (@alluarjun) May 7, 2024
Comments
Please login to add a commentAdd a comment