నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్‌ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్‌కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్.
ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్‌ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.
ఆర్యతో మారిపోయిన జీవితాలు
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్‌గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్‌లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.
అల్లు అర్జున్ రియాక్షన్
ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు
20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig
— Allu Arjun (@alluarjun) May 7, 2024
Comments
Please login to add a commentAdd a comment