
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ఆర్య. 2004లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి(మే 7) 17 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఆర్య సినిమా తనతో పాటు చాలా మంది జీవితాన్ని మలుపు తిప్పిదంటూ బావోధ్వేగ లేఖను ట్వీట్ చేశాడు.
17 years of ARYA today pic.twitter.com/YnOs5jDRDL
— Allu Arjun (@alluarjun) May 7, 2021
‘ఆర్య చిత్రం విడుదలై నేటికి 17 ఏళ్లు అవుతుంది. నా లైఫ్ చేంజింగ్ చిత్రాలలో ఇది కూడా ఒకటి. జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్ అనే బంగారు పదాలను నేను పలికిన తర్వాత ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపించడం మొదలు పెట్టారు.ఈ సినిమా కొందరి జీవితాలనే మార్చేసింది. నటుడిగా నాకు, డైరెక్టర్‌గా సుకుమార్‌కి, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్(డీఎస్పీ), డీఓపీగా రత్నవేలు, డిస్ట్రీబ్యూటర్‌గా బన్నీవాసు.. ఇలా చాలా మంది జీవితాలను మార్చేసింది. ఇలాంటి మంచి హిట్ మాకిచ్చిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.
Thank you & Gratitude Forever 💙 pic.twitter.com/9tVshZNQAU
— Allu Arjun (@alluarjun) May 7, 2021