Allu Arjun Next Movie: Sukumar Upcoming Project With Mega Hero | మెగా హీరోతో సుకుమార్‌ హ్యాట్రిక్‌
Sakshi News home page

Published Wed, Mar 21 2018 1:48 PM | Last Updated on Wed, Mar 21 2018 6:01 PM

Allu Arjun To Star In Sukumar Film Again - Sakshi

దర్శకుడు సుకుమార్‌

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన రంగస్థలం ఈ నెలాఖరున రిలీజ్‌ అవుతోంది. పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ గత చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. రంగస్థలం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతుండగా సుకుమార్ చేయబోయే తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది.

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ తన తదుపరి చిత్రం కూడా అదే బ్యానర్‌లో చేయనున్నాడు. అంతేకాదు సుకుమార్‌ నెక్ట్స్‌ సినిమాలో కూడా మెగా హీరోనే నటించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య ఘనవిజయం సాధించగా.. ఆర్య 2 యావరేజ్‌ టాక్‌ తో సరిపెట్టుకుంది. తాజాగా మరోసారి బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు సుకుమార్‌. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా.. బన్నీతో సుకుమార్ సినిమా అన్న టాక్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement