feel my love
-
'ఫీల్ మై లవ్' అంటున్న వరుణ్
మెగా వారసుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయినా.. కమర్షియల్ సక్సెస్ అందుకోవటంలో వెనకపడుతున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, తరువాత లోఫర్ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆలోచనలో పడ్డ వరుణ్ నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరోసారి క్రిష్ దర్శకత్వంలో రాయబారి పేరుతో థ్రిల్లర్ సినిమా చేయాలని భావించినా, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వరుణ్ పక్కన పెట్టేశాడు. కమర్షియల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవటం కోసం లవ్ స్టోరి తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫీల్ మై లవ్ పేరుతో లవ్ స్టోరి ప్లాన్ చేస్తున్నాడు వరుణ్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవినే టైటిల్‌గా ఫిక్స్ చేసిన ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ
చాలా రోజులుగా టాలీవుడ్ లో షికారు చేస్తున్న ఓ వార్త త్వరలో నిజం కాబోతుంది. ఎనర్జిటిక్ మ్యూజిక్ తో పాటు అదే స్థాయిలో స్టేజ్ పర్ఫార్మెన్సులతోనూ ఇరగదీసే స్వర సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంగా కుమారి 21 ఎఫ్ సక్సెస్ మీట్ వేదికగా నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు అదే స్పీడులో ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన దిల్ రాజు. తాజా దిల్ రాజు ఫీల్ మై లవ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో దేవీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇదే అన్న టాక్ మొదలైంది. దేవీ శ్రీ సంగీతం అందించిన సూపర్ హిట్ సినిమా ఆర్యలోని ఓ పాట పల్లవినే రిజిస్టర్ చేయించటంతో ఇదే దేవీ శ్రీ హీరోగా తెరకెక్కే సినిమాకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. -
ఫీల్ మై లవ్..
ఈ సీన్ చూస్తే ఏమనిపిస్తుంది.. ఎన్నో ప్రేమ కథల్లో జరిగే సీన్ రిపీట్ అవుతున్నట్లు లేదూ.. మిడతలా కనిపిస్తున్న ఈ కీటకం మరోదానికి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు కనిపించడం లేదూ.. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందో మనకు తెలియదు గానీ.. ఇలాంటి అరుదైన చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ యూదీ సా క్లిక్‌మనిపించారు. ఆ సమయంలో కీటకం ఓ పువ్వును పట్టుకోవడంతో ఈ ఫొటోకు రొమాంటిక్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పారు.