'ఫీల్ మై లవ్' అంటున్న వరుణ్ | Varun tej Next movie title Feel my love | Sakshi
Sakshi News home page

'ఫీల్ మై లవ్' అంటున్న వరుణ్

Published Thu, Feb 18 2016 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

'ఫీల్ మై లవ్' అంటున్న వరుణ్

'ఫీల్ మై లవ్' అంటున్న వరుణ్

మెగా వారసుడిగా టాలీవుడ్కి పరిచయం అయినా.. కమర్షియల్ సక్సెస్ అందుకోవటంలో వెనకపడుతున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, తరువాత లోఫర్ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు.  దీంతో ఆలోచనలో పడ్డ వరుణ్ నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

మరోసారి క్రిష్ దర్శకత్వంలో రాయబారి పేరుతో థ్రిల్లర్ సినిమా చేయాలని భావించినా, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వరుణ్ పక్కన పెట్టేశాడు. కమర్షియల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకోవటం కోసం లవ్ స్టోరి తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫీల్ మై లవ్ పేరుతో లవ్ స్టోరి ప్లాన్ చేస్తున్నాడు వరుణ్.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవినే టైటిల్గా ఫిక్స్ చేసిన ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement