![రా ఏజెంట్‌గా!](/styles/webp/s3/article_images/2017/09/3/71455470541_625x300.jpg.webp?itok=KHSXZRin)
రా ఏజెంట్‌గా!
మొదటి సినిమా ‘ముకుంద’లో పక్కింటి అబ్బాయిలా ఉండే పాత్రలో కనిపించి, అందరికీ దగ్గరయ్యారు వరుణ్ తేజ్. రెండో చిత్రం ‘కంచె’లో సైనికుడిగా కనిపించి, భేష్ అనిపించుకున్నారు. ఇక, మూడో చిత్రం ‘లోఫర్’లో మంచి మాస్ కుర్రాడిలా రెచ్చిపోయారు. ఇలా సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రలతో ముందుకెళుతున్న వరుణ్ తేజ్ తన నాలుగో చిత్రంలో గూఢచారిగా కనిపించనున్నారు. ‘కంచె’లో వరుణ్‌ని రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన సైనికుడిలా మలిచిన క్రిష్ ఇప్పుడు ‘రాయబారి’లో భారత నిఘా వ్యవస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)విభాగానికి చెందిన ఏజెంట్‌గా వరుణ్‌ను చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘కంచె’ తర్వాత మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని వరుణ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయి. మార్చిలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు.