లవ్‌లో పడ్డావా అన్నారు! | Sumanth Ashwin interview about Lovers success | Sakshi
Sakshi News home page

లవ్‌లో పడ్డావా అన్నారు!

Published Sun, Aug 17 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

లవ్‌లో పడ్డావా అన్నారు!

లవ్‌లో పడ్డావా అన్నారు!

 ‘‘సినిమాను థియేటర్‌లో చూస్తే వచ్చే మజా ఏంటో ఇప్పుడు తెలిసింది. ముఖ్యంగా మా ‘లవర్స్’ సెకండ్ హాఫ్‌కి థియేటర్లో వస్తున్న స్పందన చూస్తే... ఇండియా వరల్డ్‌కప్ ఫైనల్ గుర్తొచ్చింది. ద్వితీయార్ధంలోని సీన్లు టెన్‌థౌజండ్ వాలా పేలినట్లు పేలాయి’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఆయన కథానాయకునిగా హరినాథ్ దర్శకత్వంలో... సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు నిర్మించిన ‘లవర్స్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
 
 మారుతి సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తోందనీ, తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్నిచ్చిన చిత్రమిదని సుమంత్ అశ్విన్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందం వెలిబుచ్చారు. ఇంకా మాట్లాడుతూ- ‘‘నా కథల విషయంలో నాన్న ప్రమేయం ఉంటుంది. అయితే... ఏ కథ అయినా ముందు వినేది నేనే. నాకు నచ్చాకే నాన్న వింటారు. నాన్న మంచి జడ్జ్. అందుకే ఇలా...’’ అని చెప్పారు.
 
 కథానాయిక నందిత పాత్ర కథలో కీలకమనీ, సప్తగిరి కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అయ్యిందనీ ఆయన తెలిపారు. ‘‘‘లవర్స్’లో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు ఎక్స్‌ప్రెషన్ నాకు తెలీకుండానే గొప్పగా వచ్చేసింది. ‘ఏంటి? నిజంగానే లవ్‌లో పడ్డావా?’ అని మారుతి ఏడిపించారు. నిజానికి నా లవర్ సినిమానే’’ అన్నారు సుమంత్ ఆశ్విన్. ప్రస్తుతం ‘దిల్’రాజు ‘కేరింత’ చేస్తున్నాననీ, అలాగే... రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాననీ సుమంత్ అశ్విన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement