అందరికీ నచ్చే లవర్స్ | Samantha to launch Sumanth Ashwin's 'Lovers' audio | Sakshi
Sakshi News home page

అందరికీ నచ్చే లవర్స్

Published Tue, Jul 1 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

అందరికీ నచ్చే లవర్స్

అందరికీ నచ్చే లవర్స్

 సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో రూపొందిన చిత్రం ‘లవర్స్’. హరినాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు నిర్మాతలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. ‘లవర్స్’ టీమ్ సమక్షంలో బర్త్‌డే వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉందని సుమంత్ అశ్విన్ అన్నారు. మారుతి మాట్లాడుతూ -‘‘నిర్మాణ బాధ్యత తప్ప క్రియేటివ్ సైడ్ ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అనుకున్నాను.
 
  అయితే... ఎమ్మెస్ రాజుగారి కోరిక మేరకు ఈ సినిమాకు కథనం, సంభాషణలు అందించాల్సి వచ్చింది. రెండు రోజుల షూటింగ్ మినహా చిత్రీకరణ పూర్తయింది. సమంత చేతుల మీదుగా ఈ నెల 24న పాటల్ని విడుదల చేస్తాం. ఆగస్ట్‌లో సినిమా విడుదల ఉంటుంది’’ అని తెలిపారు. యువతరానికి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయని దర్శకుడు చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు దామోదరప్రసాద్, వేమారెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: జె.బి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అడ్డాల శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement