సుమంత్ అశ్విన్‌తో సుకుమార్ సినిమా
‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న సుమంత్ అశ్విన్ తన కెరీర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ పక్క యువతకు, మరో పక్క కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యే విధంగా కథలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మారుతి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న సుమంత్ అశ్విన్, సుకుమార్ నిర్మాణంలో మరో సినిమా కమిట్ అయ్యారు. సుకుమార్ నిర్మాతగా మారి వరుసగా తన శిష్యులతో సినిమాలు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ‘ఆర్య’ నుంచి తనతో కలిసి పనిచేసిన వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ సుకుమార్ తొలి సినిమా నిర్మించబోతున్నారు. ఇందులో కథానాయకునిగా సుమంత్ అశ్విన్‌ని ఎంపిక చేసుకున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.