లవర్స్‌గా సుమంత్‌అశ్విన్, నందిత
లవర్స్‌గా సుమంత్‌అశ్విన్, నందిత
Published Thu, Aug 22 2013 12:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
‘‘ఈ కథను హరినాథ్ తొమ్మిది నెలలు కష్టపడి తయారు చేసుకున్నాడు. కథ, డైలాగులు అద్భుతంగా రాశాడు. అందుకే నిర్మాణంలో భాగస్వామి అయ్యాను. అంతకు మినహా క్రియేటివ్ సైడ్ నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ ఉండదు. ఒకవైపు దర్శకత్వం వహించడంతో పాటు మరోవైపు మారుతి టాకీస్‌పై ఇలాంటి మంచి చిత్రాలను నిర్మిస్తుంటాను.
ఈ నెల 26న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు మారుతి. సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, మహేంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘లవర్స్’. హరినాథ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి డా. డి.రామానాయుడు, కె.ఎస్. రామారావు కెమెరా స్విచాన్ చేయగా, బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు.
వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు తెలిపారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ -‘‘అంతకు ముందు మంచి టీమ్‌తో, ఆ తర్వాత మంచి టీమ్‌తో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది’’ అన్నారు. పెళ్లయిన కొత్తలో, సింహా, బస్‌స్టాప్, జబర్దస్త్ చిత్రాలకు సహనిర్మాతగా చేశానని, మాయాబజార్ మూవీస్ ప్రారంభించి తొలి ప్రయత్నంగా వంశీతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నానని మహేంద్ర తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో సూర్యదేవర నాగవంశీ, నందిత పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవన్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, లైన్ ప్రొడ్యూసర్: డి. సతీష్.
Advertisement
Advertisement