పటేల్ సర్తో మరో హీరోయిన్ | Tanya Hope in Jagapathi Babu Patel S I R | Sakshi
Sakshi News home page

పటేల్ సర్తో మరో హీరోయిన్

Published Thu, Apr 13 2017 1:10 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

పటేల్ సర్తో మరో హీరోయిన్

పటేల్ సర్తో మరో హీరోయిన్

కొంత కాలంగా విలన్, క్యారెక్టర్ రోల్స్కు మాత్రమే పరిమితమైన సీనియర్ స్టార్ జగపతిబాబు, మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి నిర్మాణంలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై పటేల్ సర్ సినిమాలో నటిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమలో జగ్గుభాయ్ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. ఈ సినిమాతో వాసు పరిమి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సినిమా ఓపెనింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కుసూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే సినిమాలో నటించే నటీనటులకు ప్రస్తుతం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా మలయాళీ భామ భావనను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరో కీలక పాత్రకు అప్పట్లో ఒకడుండేవాడు ఫేం తాన్య హోపే ఫైనల్ చేశారు. ప్రస్తుతం వర్క్షాప్ పాల్గొంటున్న ఈ భామ పటేల్ సర్లో క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపు తీసుకువస్తోదని నమ్ముతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement