ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు
–జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తి
– కలెక్టరేట్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండు వరకు భారీ ర్యాలీ
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
–ఓటర్ల జాబితా సవరణలో బాగ పనిచేసిన వారికి ప్రశంసాపత్రాల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలకులను ఎన్నుకునేందుకు, ప్రజాస్వామా్యన్ని పరిరక్షించేందుకు ఓటే ఆయుధమని జిల్లా జడి్జ అనుపమా చక్రవర్తి అన్నారు. ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండులో 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ కలెక్టరేట్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పచ్చ జెండా ఊపీ ర్యాలీ ప్రారంభించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోద కావాలని సూచించారు. దేశ దిశ, దశను మార్చే శక్తి యువతకు ందని అన్నారు. సమర్థనాయకత్వం దేశానికి రావాలంటే ఓటుహక్కు వినియోగించుకోవాలని చెపా్పరు.
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన వారు సార్వభౌములు వంటి వారన్నారు. ఎవరైనా అర్హులుంటే ఓటరుగా నమోదుకు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నరసింహులు మాట్లాడుతూ... యువతీ యువకుల్లో చాలా మంది ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అసక్తి చూపడం లేదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఆలోచించి మంచివారికి వేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... దేశాన్ని అసాంఘిక శక్తుల నుంచి కాపాడే శక్తి ఓటుకు ఉందని దీనిని స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకుంటామని అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞచేయించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. చాంద్‌బాష ప్రదర్శించిన ఇంద్రజాలం, వివిధ నృత్య ప్రదర్శనలు అందరిని మంత్రముగ్దులు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అన్ని బృందాలకు జిల్లా కలెక్టర్ రూ.10వేల ప్రకారం నగదు బహుమతి ప్రకటించారు. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఓటర్ల జాబితా సవరణలో భాగ పనిచేసి అర్హులయిన వారందరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేసిన వారికి, సీనియర్ ఓటర్లను కలెక్టర్, రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, జిల్లా ఎస్పీ ప్రశాంసా పత్రాలతో సత్కరించారు.
18ఏళ్లు నిండిన వెంటనే ఓటర్లుగా నమోదైన యువకులకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఈఓ రవీంద్రనాథరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, కర్నూలు, కల్లూరు తహసీల్దార్లు రమేష్‌బాబు, నరేంద్రనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.