
వెంగళరావునగర్: ఆయుధాలు మరమ్మతులకు వచ్చిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ తెలియజేశారు. యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో బుధవారం ఆర్మరర్ బేసిక్ కోర్స్ రెండో బ్యాచ్ ప్రారంభ కార్యక్రమ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అంజనీకుమార్ ఆర్మరల్ బేసిక్ కోర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుధాల మరమ్మతులులో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అప్పుడే ఎలాంటి కొత్త సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు.
అనంతరం ఆయన బేస్ రిఫైర్ వర్క్‌షాపును సందర్శించారు. ఇందులో భాగంగా ఆయుధాలు ఎలా మరమ్మతులు చేసే విధానం, ఎటువంటి సమస్యలు వస్తాయని అంటో ఆర్మరర్స్‌ను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ ఎం.ఎస్.సిద్ధిఖీ, ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, వర్క్‌షాప్ ఇన్‌చార్జి పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.