విద్యా హక్కుకు ఆర్టీఐ అస్త్రం
విశ్లేషణ
అందరికీ విద్య ప్రాథమిక హక్కుతో సమానమని అటు రాజ్యాంగం, ఇటు సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి ఏ మాత్రం ఇష్టం లేదు.
చదువులేకుంటే సమాజం సాగదు. విద్యలేక వికాసం లేదు. విద్య ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కొందరికే అరుునా, కొంత వరకే అరుునా ఆరేళ్ల వయసు వచ్చిన ప్రతి బాలుడూ, బాలిక బడిలో చేర్చే ఏర్పాటు, ఆ తరువాత 14 ఏళ్లు వచ్చే వరకు చదివించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ఉచిత నిర్బంధ విద్య. పిల్లలు కాదనడానికి వీల్లేదు తల్లిదండ్రులు బడికి పంపకుండా పిల్లలను ఆపడానికి వీల్లేదు. రాజ్యాంగం వచ్చిన పదేళ్లలోగా పిల్లలందరికీ చదువు అందే ఏర్పాటు చేయాలని ఆదేశిక సూత్రం నిర్దేశిం చింది. కాని కేంద్రంలో రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా ప్రభువులు ఆ విషయం పూర్తిగా మరిచి పోయారు. కొత్త తరానికి తీరని అన్యాయం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలితరం విద్యార్థినీ విద్యార్థులను చదివించే పవిత్ర బాధ్యతను స్వాతం త్య్రం కోసం పోరాడి సాధించి అధికారంలోకి వచ్చిన నేతలే వదిలేయడం చరిత్ర మరవని విషాదం. మొదటి తరాన్నే కాదు, తర్వాత ఆరు తరాలను ప్రజా ప్రభువులు వదిలేసారు.
బ్రిటిష్‌వారు చెప్పింది గుమాస్తాలను తయారు చేసే చదువు అని విమర్శించిన జాతీయోద్యమ నాయ కులు కనీసం గుమాస్తా చదువులు కూడా అందరికీ అందించలేకపోవడం ఘోరవైఫల్యం. ఆ అపజయం క్రీనీడలనుంచి మన విద్యారంగం ఇంకా విముక్తం కాలేదు. రాజ్యంగంలో ఆదేశిక సూత్రం రూపంలో ఉన్నా, అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కుతో సమానమని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టిం చుకోలేదు. ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులోకి తేవాలని ఉద్యమాలు నడపవలసి వచ్చింది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడం రాజకీయ పార్టీ లకు ఇష్టం లేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి అంతకన్నా ఇష్టం లేదు. ఇవీ తొలినాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల తీరు. వేలకోట్ల రూపాయలు ఉన్నత విద్యమీద ఖర్చుచేస్తూ ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. సర్కారీ బడులు పెంచలేదు. ఉపా ధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఉండవలసినంత లేదు. సర్కారీ బడిలో మరుగుదొడ్లు ఉన్నాయో లేదో చూసు కునే వారు లేరు. ఆ కారణంగా ఆడపిల్లలు బడికి రాలేక పోవడం, ఆడవారిలో విద్యావంతుల సంఖ్య బాగా పడిపోవడం మన ప్రభువులు సాధించిన గొప్ప విజ యాలు. కుటుంబాలను చదివించగలిగే మహిళలకు చదువు చెప్పలేకపోరుున పథకాలు ఎవరికోసం?
అనేకానేక పోరాటాల ఫలితంగా పరిమిత రూపంలో విద్యాహక్కును రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. ఒక చట్టం ద్వారా చదువులు నేర్పే విధానం ప్రకటిస్తామన్నారు. కాని ఆ శాసనం తేవడానికి మరి కొన్నేళ్లు కాలయాపన చేశారు. చివరకు 2009లో చట్టం రావడం, మరి కొన్నాళ్లకు దాన్ని అమలు చేయడం సాధ్యమరుుంది. చదువు చెప్పే బాధ్యతలను తనమీద మోపుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వ హించకపోతే అడగవలసిన బాధ్యత పౌర సమా జానిది. పిల్లలున్న సమీప ప్రాంతంలో బడులు నెల కొల్పకపోతే ఎందుకని నిలదీయాలి. ఆ బడిలో పంతుళ్లు లేకపోతే, ఎప్పుడు నియమిస్తున్నారని అడ గాలి. పిల్లలను హింసించడం నేరం కాబట్టి దానికి పాల్పడిన వారిమీద ఏ చర్యలు తీసుకున్నారని అడ గాలి, మళ్లీ ఆ నేరం జరగకుండా ఏంచేశారని అడగాలి. బడుల కోసం ఎన్ని నిధులు ఇవ్వాలి? ఎంత ఇచ్చారు? ఎంత ఖర్చు చేశారు? ఆ ఖర్చుల వివరాలేమిటి అని పౌర సమాజం ప్రశ్నించాలి. చర్యలు తీసుకునే దాకా వెంటబడాలి. లేకపోతే మరికొన్ని తరాలు చదువులేని తరాలుగానే గడిచిపోతారుు.
ప్రభుత్వ బాధ్యతల నిర్వహణ సమాచారం తెలు సుకోవడానికి విద్యా హక్కు చట్టంలో కూడా నియ మాలున్నారుు. కాని ఆ బాధ్యతలు నెరవేర్చని ప్రభు త్వాలను, ప్రాథమిక విద్యా శాఖలను అడగడానికి ఫ్రజలు తమ చైతన్యాన్ని ఉపయోగించాలి. ఆ చైత న్యానికి కొత్త పరికరం ఒకటి తోడరుుంది. అదే సమా చార హక్కు. 2009 నాటి చట్టం ఇచ్చిన చదువు హక్కును పదును పెట్టడానికి 2005లో వచ్చిన సమా చార హక్కు కొత్త అవకాశాలను కల్పించింది. ఏ కార ణంగానైనా ప్రభుత్వం పాఠశాలలు పెట్టలేని పక్షంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రరుువేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను వెనుకబడిన వర్గాల వారికి కేటారుుంచాలని విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 25 శాతం సీట్ల భర్తీ, ప్రవేశాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే కార్యక్రమాన్ని ప్రతి ప్రరుువేటు పాఠశాల స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 25 శాతం పిల్లలకు చదువు చెప్పడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నది. కనుక ప్రరుు వేటు పాఠశాలే అరుునా, మిగతా విషయాల్లో ఆర్టీఐ చట్టం పరిధిలోకి పూర్తిగా రాకపోరుునా, ఈ 25 శాతం ప్రవేశాల విషయంలో వారు ప్రభుత్వానికి, ప్రజలకు సమాచారం చెప్పవలసిందే. కనుక విద్యాశాఖ ప్రతి ప్రరుువేటు పాఠశాలలో ఏటేటా జరిగే ప్రవేశాలను పూర్తి వివరాలతో సహా ప్రజల ముందుకు ఉంచడానికి ఏర్పాటు చేయవలసిందే. లేకపోతే అది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుంది.
మాడభూషి శ్రీధర్ (కేంద్ర సమాచార కమిషనర్)
ఈమెయిల్: professorsridhar@gmail.com