right to education
-
ప్రాణత్యాగానికైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆయన్ను తీవ్రవాది అన్నారు.. అయినా పోరాటం ఆపలేదు. దేశద్రోహి అన్నారు.. కానీ న్యాయస్థానం నమ్మలేదు. అనుమానించారు.. అవమానించారు.. అడ్డగించారు.. అయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ఆయన.. సమానత కోసం అహర్నిశలు పోరాడే యోధుడు.. పారదర్శకత కోసం పాటుపడే ధీరుడు.. బెదిరింపులకు భయపడని శూరుడు.. అలాంటి వ్యక్తి ఇపుడు భావితరాల విద్య కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమంటున్నారు. ఆయనే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే..! దేశంలోని చిన్నారులకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యా హక్కు (ఆర్టీఈ) అమలు కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ తన పోరాటం కొనసాగుతుందని సందీప్‌పాండే స్పష్టంచేశారు. అందుకోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పాండే ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి: ఐఐటీలో చదువుకున్నవారంతా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నారు. మీరు మాత్రం అమెరికా వెళ్లి ఇక్కడికొచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు ఎందుకు? పాండే: చిన్నప్పటి నుంచి నేను గాంధేయవాదిని. ఆయన బాటలోనే నడవాలన్నది నా ఆశయం. దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు నేను సాగిస్తున్న ఈ పోరాటం గాంధీ స్ఫూర్తితో మొదలుపెట్టిందే. ప్రజాసమస్యలపై పోరాడాలన్న ఆలోచన ఎపుడు వచ్చింది? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉన్నపుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ సమయంలో గాంధీగారి పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. నా మిత్రులు దీపక్‌గుప్తా, శ్రీవాస్తవతో చర్చించి.. ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సంస్థను అక్కడే రిజిస్టర్ చేయించాం. నా మిత్రుల్లో శ్రీవాస్తవ హైదరాబాదీనే! మీరు ఉద్యమబాట పట్టేటపుడు లక్ష్యం చాలా దూరమని, కష్టమని అనిపించలేదా? గాంధీజీ స్ఫూర్తితోనే పోరాటం మొదలుపెట్టాను. కష్టమైనా నష్టమైనా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. సమాచార హక్కు పోరాటం నేపథ్యం ఏంటి? దేశంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలకు అవగాహన పెంచేందుకే 2008లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని నిర్వహించాం. మొదట్లో అందరూ అది సాధ్యం కాదన్నారు. కొందరు హేళన చేశారు. మరికొందరు ఇది జరిగే పనేనా అని పెదవి విరిచారు. అయినప్పటికీ అలుపెరుగని పోరాటంతో ముందుకే వెళ్లాం. 2002లో రామన్ మెగసెసె అవార్డు వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు? సంతోషమే, కానీ నేను కేవలం అవార్డు మాత్రమే తీసుకున్నాను. దాంతోపాటు వచ్చిన నగదును వెనక్కి ఇచ్చేశాను. అవార్డు మన కృషికి ఫలితమే అయినప్పటికీ, వాటితోనే సంతృప్తిపడితే అక్కడే ఆగిపోతాం. మీరు అమెరికాను ఉగ్రవాద దేశం అని ఎందుకు అనాల్సి వచ్చింది? నేను మనీలా (ఫిలిప్పీన్స్)లో రామన్ మెగసెసె అవార్డు తీసుకున్నపుడు ఇరాక్‌పై అమెరికా దాడికి దిగింది. ఈ చర్యను మానవతావాదిగా వ్యతిరేకించాను. అందులో భాగంగానే మనీలాలోని అమెరికా ఎంబసీ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నా. ‘అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్’అని నేను పలికిన పదాలు మరుసటిరోజు మీడియాలో కలకలం రేపాయి. ఈ భూమి మీద మొదట మానవ హక్కులకు రక్షణ ఉండాలి. మానవ హక్కులకు రక్షణ కల్పించలేని దేశాన్ని ఏమనాలో అప్పుడు నాకు తెలియలేదు. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ అధికారులు అంత తేలిగ్గా వదిలారా? లేదు.. (నవ్వుతూ) నాపై ప్రతి విమర్శలకు దిగారు. రామన్ మెగసెసె అవార్డుతోపాటు వచ్చిన 50వేల డాలర్లను వెనక్కి ఇవ్వాలని సవాల్ విసిరారు. వెంటనే ఆ చెక్కును అక్కడే ఇచ్చేసి కేవలం అవార్డుతో మాత్రమే ఇండియా వచ్చా. వాళ్లు అంతటితో వదిలారా? లేదు, అమెరికా వెళ్లినపుడు నేను ఉగ్రవాదినని, జాతిద్రోహి అంటూ అమెరికా ప్రభుత్వానికి నాపై కొందరు అతివాదులు ఫిర్యాదు చేశారు. దాంతో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం ఇమిగ్రేషన్‌లో రెండు గంటల పాటు నన్ను ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉండగా నా ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత వదిలేశారు. మీరెప్పుడూ ఖాదీ దుస్తులే ధరిస్తారు.. పైగా ఇస్త్రీ కూడా చేసుకోరు.. నాకు అలాగే ఇష్టం. ఖాదీ బట్టలు వేసుకోవడం వల్ల చేనేతపై ఆధారపడే వారికి ఎంతో కొంత ఉపాధి లభిస్తుందన్న తృప్తి నాకు దక్కుతుంది. మీరు పాలు తాగరని విన్నాం.. నిజమేనా? వాస్తవానికి ఏ పశువు పాలు అయినా... వాటి బిడ్డల కోసమే కదా! అందుకే, వాటి బిడ్డల కడుపులోకి పోవాల్సిన పాలు నా కడుపులో పోసుకోలేను. జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ నేను తీసుకోను. భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి కోసం ఢిల్లీ నుంచి ముల్తాన్ వరకు శాంతియాత్ర చేశారు కదా! భయం వేయలేదా? నా యాత్ర 2005 మార్చి 23న ఢిల్లీలో మొదలైంది. వాఘా సరిహద్దు వరకు పాదయాత్రగానే సాగింది. కానీ పాకిస్తాన్లో పాదయాత్రకు ఆ దేశం అనుమతించలేదు. అందుకే మా యాత్రను వాహనంలోకి మార్చాం. ఆ యాత్రకు పాకిస్తానీలు చూపించిన స్పందనను ఎప్పటికీ మరిచిపోలేను. వారు వీధుల్లోకి వచ్చి స్వాగతం పలికారు. చాలామంది భారత్‌తో పాకిస్తాన్ స్నేహం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. మిమ్మల్ని మావోయిస్టు అన్నపుడు ఎలా అనిపించింది? కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినంత మాత్రాన మావోయిస్టులంటే ఎలా? వాస్తవానికి మన దేశంలో ఇప్పటికీ పేద ప్రజల పక్షాన పోరాడుతోంది కమ్యూనిస్టులే కదా! మీపై జాతి వ్యతిరేకి అన్న ముద్ర కూడా పడింది కదా! ఆ సమయంలో నేను బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో నా విద్యార్థులకు నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని ప్రదర్శిద్దామనుకున్నా. అంతలోనే నన్ను జాతి వ్యతిరేకి అని అరెస్టు చేసి కేసులు పెట్టారు. బీహెచ్‌యూలో ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్ను బలవంతంగా తొలగించారు. కానీ నా మీద మోపిన అభియోగాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది! సాఫ్ట్ డ్రింక్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి కారణమేంటి? సాఫ్ట్ డ్రింక్‌ల పేరిట మన దేశంలో జలవనరుల దోపిడీ జరుగుతోంది. కోలా–పెప్సీ కంపెనీల తయారీ ప్లాంట్లు ఉన్నచోట భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయం చేసుకోవడం కష్టంగా మారింది. ఎవరికీ ప్రయోజనం లేని డ్రింకుల కోసం దేశానికి అన్నంపెట్టే రైతుకు అన్యాయం చేయడం తగదు కదా! అందుకే, దానిపైనా ఉద్యమించా! విద్యా హక్కు చట్టం కోసం పోరాటం ఎంతవరకు వచ్చింది? మనదేశంలో 16 ఏళ్లలోపు ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది 8వ తరగతి వరకే చదువుతున్నారు. వీరిలో 25 శాతం బాల కార్మికులుగా ఉన్నారు. దేశాన్ని నిర్మించే రేపటి పౌరులకు విద్యను అందించడంలో నిర్లక్ష్యం తగదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఉచిత నిర్బంధ విద్యను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని విస్మరించాయి. ఆ చట్టం అమలు కోసం నిరాహారదీక్షచేయడానికి వెనుకాడను. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ గురించి మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాహక్కు చట్టం అమలు దారుణంగా ఉంది. ఇక్కడ విద్యావ్యవస్థను కార్పొరేట్ కల్చర్ శాసిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు నిర్వహించడం దారుణం. వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వీలైతే వారికి వివిధ ఎంట్రన్స్ టెస్టుల్లో ప్రభుత్వమే కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయా? ఎందుకు రావు? 2015, జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కార్పొరేట్ స్కూలులో పేద విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంతో ఆర్టీఈ అమలు కోసం ఏడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్ చట్టం అమలుకు అంగీకరించారు. ఆ సమయంలో నా దీక్షకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ–2009 చట్టం అమలుకు, కార్పొరేట్ విద్య అంతానికి.. కోచింగ్ సెంటర్లు మూయించాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. -
‘నో డిటెన్షన్’ రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: పాఠశాలల్లో ‘నో డిటెన్షన్ విధానం’ రద్దుకు ఉద్దేశించిన విద్యాహక్కు సవరణ బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. అయితే, స్కూళ్లలో డిటెన్షన్ విధానం కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. బాలలకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు సవరణ బిల్లు–2017పై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి జవడేకర్ మాట్లాడుతూ.. ‘తాజా సవరణతో ఎలిమెంటరీ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. తెలంగాణ, కేరళ, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు’ అని తెలిపారు. తాజా బిల్లు ప్రకారం 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఫెయిలైన వారికి మరో అవకాశంగా రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు పెడతారు. లేదంటే అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. అయితే, ఈ సవరణలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీ, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, అకాలీదళ్ ఈ బిల్లును సమర్ధించాయి. విద్యార్థులను 8వ తరగతి వరకు డిటెయిన్ చేయకుండా తర్వాతి తరగతులకు పంపించాలని ప్రస్తుత చట్టం చెబుతోంది. -
బడి బయట బాలలు 1,00,000
2015–16 లెక్కలు వెల్లడించిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014–15 విద్యాసంవత్సరంలో 36,519 మంది, 2015–16 విద్యా సంవత్సరంలో 46,391 మంది బాలలు బడి బయట ఉన్నారని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడీఐఎస్ఈ) లెక్కల ప్రకారం 2014–15లో 2,50,581 మంది, 2015–16లో 1,12,991 మంది బాలలు బడి బయట ఉన్నారని తెలిపింది. జాతీయ స్థాయిలో విద్యా హక్కు చట్టం–2009 అమలుపై తాజాగా కాగ్ బహిర్గతం చేసిన నివేదికలో రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు, లోపాలను పొందుపరిచింది. అంశాల వారీగా పరిశీలిస్తే.. ► తెలంగాణలో రూ.5.73 కోట్ల సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిధులను 2012–13 నుంచి 2015–16 మధ్యకాలంలో ఇతర శాఖలకు దారిమళ్లించడంతో దుర్వినియోగమయ్యాయని కాగ్ తప్పుపట్టింది. ► 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేసిన 21 పాఠశాలలకు 2014 మార్చి–డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిసులు జారీ చేయగా, అందులోని 9 పాఠశాలలకు రూ.15.29 కోట్ల జరిమానాలు విధించింది. ఈ జరిమానాలను ఇంత వరకు వసూలు చేయలేదు. ► రాష్ట్రంలో తనిఖీలు జరిపిన రెండు జిల్లాల్లో 67 మంది ఉపాధ్యాయులను బోధనేతర పనుల కోసం వినియోగించుకుంటున్నారు. ► 2012–13 మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలోని 666 పాఠశాలల విద్యుదీకరణ కోసం రూ.1.03 కోట్లు విడుదల చేయగా, 2016 మార్చి వరకు ఈ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ► విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సలహా కమిటీని ఏర్పాటు చేయలేదు. -
దిక్కూ మొక్కూలేని ‘విద్యా హక్కు’!
సందర్భం విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి అప్పుడే ఏడేళ్లు పూర్తయింది. 2010 ఏప్రిల్ 1న ఆ చట్టం అమల్లోకి వచ్చిన రోజున అందరూ ఎంతో సంతోషిం చారు. ఎందుకంటే స్వాతంత్య్రానం తరం సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేశారు. ఈ పథకాలు–ఆపరే షన్ బ్లాక్ బోర్డు, డీపీఈపీ, సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఈ అను భవాల తర్వాత విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. కానీ ఇది సైతం అలంకారప్రాయంగా మిగిలిపోవడం విచారకరమైన వాస్తవం. విద్యా హక్కు చట్టం కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తామని, లక్షలాదిమంది ఉపాధ్యాయులను నియమిస్తామని ఆనాటి యూపీఏ ప్రభుత్వం చెప్పినప్పుడు అందరూ హర్షించారు. నిధులు, నియామకాల సంగతలా ఉంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో నిరుపేద వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబం ధనే అమలు కావడం లేదు. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒక సర్వే ప్రకారం ఢిల్లీలో 44.61 శాతం, ఉత్తరాఖండ్‌లో 31.96 శాతం, మహారాష్ట్రలో 17.87 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 0.79 శాతం సీట్లు మాత్రమే నిరుపేద పిల్లలకు ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రా లతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఈ మాత్రమైనా అమలు కావడం లేదు. 25 శాతం సీట్ల కేటాయింపు రాజ్యాంగ సమ్మతమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఇదే పరిస్థితి. విద్యాహక్కు చట్టం అమలు కోసం కేంద్రం ఇస్తున్న నిధులు 33 శాతం మురిగిపోయాయి. ప్రథమ్ ఫౌండేషన్ వారి ఏసర్–2016 సర్వే చూస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. దేశంలో కేరళ(9 శాతం), గుజరాత్(7 శాతం) లలో మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరి గింది. అందుకు భిన్నంగా ఉత్తరాఖండ్‌లో 4 శాతం, అరుణాచల్ 5 శాతం, అస్సాంలో 4.7 శాతం విద్యార్థులు మాత్రమే ప్రైవేటు విద్యా సంస్థల్లో అదనంగా చేరారు. జాతీయ స్థాయిలో అక్షరాస్యత సగటు 69 శాతం ఉండగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అది 67 శాతం మాత్రమే. ఇక మధ్యలో బడి మానేస్తున్న పిల్లలు ఆంధ్ర ప్రదేశ్‌లో 58.9 శాతమైతే, తెలంగాణలో అది 67.2 శాతం. ప్రభుత్వ విద్యా సంస్థల పతనంలో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు రెండూ ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉంటే ఆ ప్రభుత్వాల ఆధ్వర్యం లోనే నడుస్తున్న గురుకుల పాఠశాలలు గత 45 ఏళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. గ్రామీణ పేద పిల్లలకు ఉన్నత ప్రమా ణాలతో ఉచిత విద్యనందిస్తున్న వీటిని ప్రోత్సహించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వాలు వేర్వేరు గురుకుల పాఠ శాలలు నెలకొల్పాయి. అవి సైతం మంచి ఫలితాలే సాధిస్తు న్నాయి. అయినా ఈ పాఠశాలల సంఖ్యను పెంచడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న 11,000 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 5 లక్షలమంది ఉపాధ్యాయులున్నారు. కోటి 30 లక్షల మంది విద్యా ర్థులున్నారు. వీటన్నిటినీ గురుకుల విద్యాసంస్థలుగా మారిస్తే ఒక్క పైసా అదనపు ఖర్చు లేకుండా ఇవి సైతం అద్భుత ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు 1971లో ఈ గురుకుల పాఠశాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అవి సాధిస్తున్న ఫలితాల స్ఫూర్తితో 1986లో దేశ వ్యాప్తంగా స్థాపించిన నవోదయ విద్యాలయాలు... లక్షలాది గ్రామీణ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గతంకన్నా మౌలిక సదుపాయాలు పెరిగాయి. అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారు. రెండు రాష్ట్రాలూ ఏటా రూ. 25,000 కోట్లు ఖర్చుపెడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వెదజల్లడం, నెలనెలా ఉపాధ్యాయు లకు జీతాలివ్వడం మినహా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేం దుకు తెలుగు రాష్ట్రాలు చొరవ ప్రదర్శించడం లేదు. జిల్లా పరిషత్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులు ప్రజాప్రతినిధులై.. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తీరని అన్యా యం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొంతలో కొంత నయం. 103 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాల లను కొత్తగా ప్రారంభించింది. విద్యార్థుల ఉపకార వేతనాలను పెంచింది. వృత్తి విద్యా కళాశాలలను నియంత్రించింది. ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ఉదారంగా నిధులిచ్చింది. ఇందుకు భిన్నంగా ఏపీ సర్కారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 30మందికన్నా తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. ఈ దుర్మార్గమైన స్థితి మారాలి. పాఠశాల విద్య నిర్వహణను కనీస బాధ్యతగా భావించి, వాటి ఉజ్వల భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేయాలి. జడ్పీ పాఠశాలలను గురుకుల పాఠ శాలలుగా మార్చి సంక్షేమ హాస్టళ్లను రద్దు చేయాలి. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకూ ప్రభుత్వాలే విధిగా పాఠశాలలు నడపాలి. అవి అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ఉండాలి. ఒక్క పైసా అదనపు ఖర్చు లేకుండా ఈ పనులన్నీ చేయ వచ్చు. బడుగు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్ద వచ్చు. ప్రభుత్వాలు ఆలోచిస్తాయా? - యం. రోజా లక్ష్మి వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యకర్త మొబైల్ : 94410 48958 -
పాఠశాల్లో మైదానాలు తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ: విద్యాహక్కు చట్టం కింద అన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలు, వ్యాయామ శిక్షకుడి సేవలను తప్పనిసరి చేశామని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. ఆటలు, ఇతర విద్యేతర కార్యక్రమాలకు సీబీఎస్ఈ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రాల బోర్డులు కూడా ఈ మార్గాన్ని అనునసరించాలని క్రీడల మంత్రి విజయ్ గోయల్ కోరారు. దేశంలో క్రీడల అభివద్ధికి ప్రభుత్వం ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించదని తెలిపారు. దీని కింద దేశవ్యాప్తంగా వివిధ అంచెల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.క్రీడల ప్రోత్సాహకానికి మెరుగైన వసతులు, మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి అన్నారు. -
విద్యా హక్కుకు ఆర్టీఐ అస్త్రం
విశ్లేషణ అందరికీ విద్య ప్రాథమిక హక్కుతో సమానమని అటు రాజ్యాంగం, ఇటు సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువులేకుంటే సమాజం సాగదు. విద్యలేక వికాసం లేదు. విద్య ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కొందరికే అరుునా, కొంత వరకే అరుునా ఆరేళ్ల వయసు వచ్చిన ప్రతి బాలుడూ, బాలిక బడిలో చేర్చే ఏర్పాటు, ఆ తరువాత 14 ఏళ్లు వచ్చే వరకు చదివించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ఉచిత నిర్బంధ విద్య. పిల్లలు కాదనడానికి వీల్లేదు తల్లిదండ్రులు బడికి పంపకుండా పిల్లలను ఆపడానికి వీల్లేదు. రాజ్యాంగం వచ్చిన పదేళ్లలోగా పిల్లలందరికీ చదువు అందే ఏర్పాటు చేయాలని ఆదేశిక సూత్రం నిర్దేశిం చింది. కాని కేంద్రంలో రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా ప్రభువులు ఆ విషయం పూర్తిగా మరిచి పోయారు. కొత్త తరానికి తీరని అన్యాయం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలితరం విద్యార్థినీ విద్యార్థులను చదివించే పవిత్ర బాధ్యతను స్వాతం త్య్రం కోసం పోరాడి సాధించి అధికారంలోకి వచ్చిన నేతలే వదిలేయడం చరిత్ర మరవని విషాదం. మొదటి తరాన్నే కాదు, తర్వాత ఆరు తరాలను ప్రజా ప్రభువులు వదిలేసారు. బ్రిటిష్‌వారు చెప్పింది గుమాస్తాలను తయారు చేసే చదువు అని విమర్శించిన జాతీయోద్యమ నాయ కులు కనీసం గుమాస్తా చదువులు కూడా అందరికీ అందించలేకపోవడం ఘోరవైఫల్యం. ఆ అపజయం క్రీనీడలనుంచి మన విద్యారంగం ఇంకా విముక్తం కాలేదు. రాజ్యంగంలో ఆదేశిక సూత్రం రూపంలో ఉన్నా, అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కుతో సమానమని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టిం చుకోలేదు. ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులోకి తేవాలని ఉద్యమాలు నడపవలసి వచ్చింది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడం రాజకీయ పార్టీ లకు ఇష్టం లేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి అంతకన్నా ఇష్టం లేదు. ఇవీ తొలినాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల తీరు. వేలకోట్ల రూపాయలు ఉన్నత విద్యమీద ఖర్చుచేస్తూ ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. సర్కారీ బడులు పెంచలేదు. ఉపా ధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఉండవలసినంత లేదు. సర్కారీ బడిలో మరుగుదొడ్లు ఉన్నాయో లేదో చూసు కునే వారు లేరు. ఆ కారణంగా ఆడపిల్లలు బడికి రాలేక పోవడం, ఆడవారిలో విద్యావంతుల సంఖ్య బాగా పడిపోవడం మన ప్రభువులు సాధించిన గొప్ప విజ యాలు. కుటుంబాలను చదివించగలిగే మహిళలకు చదువు చెప్పలేకపోరుున పథకాలు ఎవరికోసం? అనేకానేక పోరాటాల ఫలితంగా పరిమిత రూపంలో విద్యాహక్కును రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. ఒక చట్టం ద్వారా చదువులు నేర్పే విధానం ప్రకటిస్తామన్నారు. కాని ఆ శాసనం తేవడానికి మరి కొన్నేళ్లు కాలయాపన చేశారు. చివరకు 2009లో చట్టం రావడం, మరి కొన్నాళ్లకు దాన్ని అమలు చేయడం సాధ్యమరుుంది. చదువు చెప్పే బాధ్యతలను తనమీద మోపుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వ హించకపోతే అడగవలసిన బాధ్యత పౌర సమా జానిది. పిల్లలున్న సమీప ప్రాంతంలో బడులు నెల కొల్పకపోతే ఎందుకని నిలదీయాలి. ఆ బడిలో పంతుళ్లు లేకపోతే, ఎప్పుడు నియమిస్తున్నారని అడ గాలి. పిల్లలను హింసించడం నేరం కాబట్టి దానికి పాల్పడిన వారిమీద ఏ చర్యలు తీసుకున్నారని అడ గాలి, మళ్లీ ఆ నేరం జరగకుండా ఏంచేశారని అడగాలి. బడుల కోసం ఎన్ని నిధులు ఇవ్వాలి? ఎంత ఇచ్చారు? ఎంత ఖర్చు చేశారు? ఆ ఖర్చుల వివరాలేమిటి అని పౌర సమాజం ప్రశ్నించాలి. చర్యలు తీసుకునే దాకా వెంటబడాలి. లేకపోతే మరికొన్ని తరాలు చదువులేని తరాలుగానే గడిచిపోతారుు. ప్రభుత్వ బాధ్యతల నిర్వహణ సమాచారం తెలు సుకోవడానికి విద్యా హక్కు చట్టంలో కూడా నియ మాలున్నారుు. కాని ఆ బాధ్యతలు నెరవేర్చని ప్రభు త్వాలను, ప్రాథమిక విద్యా శాఖలను అడగడానికి ఫ్రజలు తమ చైతన్యాన్ని ఉపయోగించాలి. ఆ చైత న్యానికి కొత్త పరికరం ఒకటి తోడరుుంది. అదే సమా చార హక్కు. 2009 నాటి చట్టం ఇచ్చిన చదువు హక్కును పదును పెట్టడానికి 2005లో వచ్చిన సమా చార హక్కు కొత్త అవకాశాలను కల్పించింది. ఏ కార ణంగానైనా ప్రభుత్వం పాఠశాలలు పెట్టలేని పక్షంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రరుువేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను వెనుకబడిన వర్గాల వారికి కేటారుుంచాలని విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 25 శాతం సీట్ల భర్తీ, ప్రవేశాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే కార్యక్రమాన్ని ప్రతి ప్రరుువేటు పాఠశాల స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 25 శాతం పిల్లలకు చదువు చెప్పడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నది. కనుక ప్రరుు వేటు పాఠశాలే అరుునా, మిగతా విషయాల్లో ఆర్టీఐ చట్టం పరిధిలోకి పూర్తిగా రాకపోరుునా, ఈ 25 శాతం ప్రవేశాల విషయంలో వారు ప్రభుత్వానికి, ప్రజలకు సమాచారం చెప్పవలసిందే. కనుక విద్యాశాఖ ప్రతి ప్రరుువేటు పాఠశాలలో ఏటేటా జరిగే ప్రవేశాలను పూర్తి వివరాలతో సహా ప్రజల ముందుకు ఉంచడానికి ఏర్పాటు చేయవలసిందే. లేకపోతే అది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుంది. మాడభూషి శ్రీధర్ (కేంద్ర సమాచార కమిషనర్) ఈమెయిల్: professorsridhar@gmail.com -
విద్యా హక్కుకు స.హ.చట్టం దోహదం
తల్లిదండ్రుల సదస్సులో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టం సక్రమ అమలుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సమాచార హక్కుకు లోబడే ఉండాలన్న విషయం చట్టంలోని సెక్షన్- 2ఎఫ్ స్పష్టం చేస్తోందన్నారు. శనివారం ఇక్కడ నిర్వహించిన తెలంగాణ తల్లిదండ్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే సమాచార హక్కు చట్టం పనిచేస్తోందని, ఎవరూ దీని నుంచి తప్పిం చుకోలేరన్నారు. ప్రైవేటు పాఠశాల దోపిడీని, అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం వల్లే అక్కడ ఏ నిబంధనా అమలు కావడం లేదన్నారు. సర్కారు బడులు బాగుపడాలంటే ఎవర్ని నిలదీయాలో ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా మాట్లాడుతూ పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యాపరమైన విషయాలపై బహిరంగ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకేరకమైన విద్యావిధానంను అమలు చేయాలని సూచించా రు. తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడం ద్వారానే విద్యావకాశాల్లో అంతరాలు తగ్గుతాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక పరిస్థితులు క్షీణిం చడం వల్లే బాలకార్మిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నా రు. తల్లిదండ్రుల సంఘాల సలహాదారుడు ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన అనంతరం బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన విధాన నిర్ణయాల్లో తామెక్కడున్నామని తల్లిదండ్రులు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ క్లాసులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో కేజీ టు పీజీ వరకు అన్ని రకాల వసతులు కల్పించాలని సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించారు. -
ఇది విద్యాహక్కుకు భంగం కాదా?
విశ్లేషణ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థి తులు తలెత్తడానికి ఆ విశ్వవిద్యాలయ వివాదాస్పద వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలను చేపట్టడంలో ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం, మొరటుతనం ప్రధాన కారణం. రెండుమాసాల సెలవు అనంతరం తిరిగి విధులకు ఎందుకు హాజరు కావలసి వచ్చిందో ఆయన చెప్పిన కారణాలు విశ్వసించదగిన మీడియాలోనే వార్తలుగా వచ్చాయి. అది ఆయన మాట లలోనే: ‘రెండుమాసాలంటే సుదీర్ఘకాలం. చేయవలసిన పని చాలా ఉండిపోయింది’. ఇంకా, ఆయనను మళ్లీ విధులకు హాజరయ్యేటట్టు పురికొల్పిన మరో అంశం, ‘‘ఆయన సహోద్యోగులు పట్టుపట్టడం’’ కూడా. అంతేకాకుండా తన పునరా గమనానికి మరోకారణం- రూపన్వాల్ జుడీషియల్ కమిషన్ ‘‘దాదాపు’’ తన పనిని పూర్తి చేసిందని తాను భావించడం. వైస్‌చాన్స్‌లర్ గుర్తించడంలో విఫలమైనది, మొత్తం ప్రపంచం గుర్తించిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే-కొన్ని మాసాల నుంచి మానవ హక్కుల రక్షణలో ఆయన దారుణమైన అసమర్థతతో వ్యహరించారు. అందు లోనే విద్యార్థుల విద్య హక్కు ఇమిడి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య సహా, విశ్వవిద్యాలయ ప్రాంగణం యుద్ధాన్ని మరిపించే రీతిలో తయారు కావడానికి ఇదే కారణం. సమ్మె చేస్తున్న విద్యార్థులను శాంతింపచేయడంలో వైస్‌చాన్స్‌లర్ పూర్తిగా విఫలమయ్యారని, ఫలితంగానే సమస్య ముదిరి పోయిందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నియమించిన నిజనిర్ధారణ సంఘం కూడా చెప్పేసింది. చివరిగా- వైస్‌చాన్స్‌లర్ మళ్లీ విధులు చేపట్టడానికి వచ్చేనాటికి రూపన్వాల్ జుడీషియల్ కమిషన్ తన నివేదికను సమర్పించలేదు. తాను చేసిన పనికి వైస్‌చాన్స్‌లర్ కుంటిసాకులు వెతుకుతూ ఎలిబీ సృష్టించుకుంటున్నారు తప్ప, ఒక విద్యాలయం యుద్ధాన్ని మరిపించే విధంగా తయారు కావడానికి తన వంతు పాత్రను గురించి ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవడం లేదు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వైస్ చాన్స్‌లర్ సెలవుపై వెళ్లారన్నది సుస్పష్టం. ఇన్చార్జి వీసీని ఆయన స్థానంలో నియమించడం కూడా జరిగింది. అలాంటప్పుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు లేకుండానే, వైస్‌చాన్స్‌లర్ తనకు తానై కార్యాలయానికి వచ్చి ఎలా కూర్చుంటారు? చెప్పాపెట్టకుండా వైస్ చాన్స్‌లర్ అలా మళ్లీ వచ్చి విధులు ఎలా చేపట్టారని మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా విస్తుపోయిందని విశ్వసించదగిన మీడియా వార్తల వల్ల తెలు స్తున్నది. నిజానికి ఆ మంత్రిత్వ శాఖ నిజంగానే ఆశ్చర్యపోయిందా; లేక ఇది కూడా దోబూచులాటేనా? ఇన్ని వాస్తవలు పరిశీలించిన తరువాత ఓ అంతిమ నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. అదేమిటంటే- ఏమరేమనుకున్నా ఫర్వాలేదన్నంత రీతిలో అధికార దాహం ఉన్న వైస్‌చాన్స్‌లర్‌కు తప్పుడు నిర్ణయంతో అప్పగించిన బాధ్యత నుంచి విశ్వవిద్యాలయం పాలనా వ్యవహారాలు చూసే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆయన మాటతోనే తప్పించింది. లేదా వైస్ చాన్సలర్‌ను తొలగించినట్టు ఒక ఆట ఆడింది. కాబట్టి ఇప్పుడు వైస్‌చాన్స్‌లర్‌ను సస్పెండ్ చేయమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరే హక్కు మనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన లోటుపాట్ల మీద దర్యాప్తును నిలుపు చేయమని కోరవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం వ్యవహారాలను నిర్వ హించే బాధ్యతను మళ్లీ ఇన్చార్జి వీసీకి అప్పగించమని కోరే హక్కు కూడా మనకు వచ్చింది. ఇది మాత్రమే విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ఉపకరిస్తుంది. ఇన్చార్జి వీసీ నియామకంతోనే ఆయనకు పూర్తి స్థాయి అధికారాలను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెంటనే అప్ప గించాలి కూడా. విద్యా విషయక కార్యకలాపాలు కూడా సాగించే అధికారాలను దఖలుపరిచే సమగ్ర ఆదేశాలను జారీ చేయాలి. దానితోనే డాక్టర్ అప్పారావు వైస్‌చాన్స్‌లర్‌గా కొనసాగడం కోసం చెప్పుకోవడానికి సాకు ఏదీ మిగలదు. ఈ పని నిర్వర్తించ డంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విఫలమైతే, ఈ దోబూచు లాట వెనకాల ఆ మంత్రిత్వ శాఖ ఉందని ఇప్పటికే భావిస్తున్న అనేక వర్గాల దృష్టిలో దోషిగా నిలబడవలసి దుస్థితిని తనకు తనే తెచ్చుకోవచ్చు. ఈ వైఫ ల్యాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా నిర్ధారించుకోవలసివస్తుంది. అంటే విద్యాహక్కును ఉల్లంఘించినట్టు నిర్ధారణకు రావలసి ఉంటుంది. ఆ చట్టంలోని సెక్షన్ 12(1), (2) కింద హెచ్‌సీయూ విద్యార్థులకు ఆ హక్కును నిరాకరించి నందుకు దోషిగా నిలబడవలసి ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రేక్షకపాత్ర వహించిన దోషం కూడా ఉంటుంది. వీటితో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారం చెల్లించవలసి ఉంటుంది. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా లేదా కమిషన్ తనకు తానుగా కేసును పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇటీవల కాలంలో వరసగా జరుగుతున్న అవకతవకలకు తోడు ఈ పాపాన్ని కూడా మూట గట్టుకోరాదు. - కె.ఆర్. వేణుగోపాల్ వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి మొబైల్: 9052469165 -
హమ్మయ్య
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం పెంచింది. ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను కొంత వరకు తగ్గించింది. నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడానికి వెసులుబాటు కల్పించింది. పెరిగిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిధులు ‘జీవో 31’ జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి ప్రతి నెలా జిల్లాపై రూ.30 లక్షల అదనపు భారం సత్తెనపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిర్వహణ నిధులు పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే నిధులను కొంత పెంచుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా శుక్రవారం జీవో 31 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అయ్యే ఖర్చును ఆయా ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తాయి. 9,10 తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మధ్యాహ్న భోజన నిర్వహణ నిధులు అప్పటికి అమల్లో ఉన్న మెస్ ఛార్జీలను బట్టి ఏటా 7.5 శాతం తక్కువ కాకుండా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెంచింది. కొంత ఆలస్యమైనప్పటికీ గత ఏడాది జూలై నుంచి వర్తింపు జేయడంతో నష్టపోయిన మొత్తాన్ని పూడ్చినట్లు అయింది. జిల్లాపై రూ.30 లక్షల భారం... జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,739, ప్రాథమికోన్నత పాఠశాలలు 439, ఉన్నత పాఠశాలలు 408 ఉన్నాయి. మొత్తం 3,586 పాఠశాలలు ఉండగా వీటిలో 3,21,307 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 2,11,916 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం తాజాగా మెస్ చార్జీలు పెంచడంతో ప్రతి నెలా రూ. 30 లక్షల వరకు జిల్లా పై అదనపు భారం పడుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని 3,696 నిర్వాహణ ఏజన్సీలు అమలు చేస్తున్నాయి. మొత్తం 6,647 మంది వంట సిబ్బంది పని చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో అప్పుల భారం నుంచి కొంత మేరకు వీరికి ఉపశమనం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు ఇలా.. ఒక్కో విద్యార్థికి ఒక రోజుకు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి పాఠశాల ప్రస్తుత ధర కొత్త ధర పెరిగిన మొత్తం ప్రాథమిక రూ. 4.60 రూ. 4.86 26 పైసలు ప్రాథమి కోన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు ఉన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు -
త్యాగాలు ఎవరి కోసం..?
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు: ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారమవుతాయనుకున్నారు. పాలకులు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేస్తారని ఆశించి అనేక వర్గాల ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రస్తుత తెలంగాణ పాలకులు గత టీడీపీ, కాంగ్రెస్ అవలంబించిన అభివృద్ధి నమూనానే అమలు చేయాలనుకుంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నట్టు? ఎందుకు ఆత్మత్యాగాలు చేసినట్లు?’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ నిలదీశారు. ప్రత్యేక అవసరాలు గల చెవిటి, మూగ, మానసిక వైకల్యం, దృష్టిలోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం విద్యా హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన హరగోపాల్ మాట్లాడుతూ అహంకారంతో కాకుండా బాధలను పంచుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలను పాలకులు నిరాశకు గురి చేశారన్నారు. చెవిటి, మూగవారికి సైగలతో కూడిన విద్య కోసం ప్రత్యేక బడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రాధాన్యమివ్వాలి... జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులు మానసికంగా కుంగిపోకుండా సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. వికలాంగులకు, అనాథలకు విద్య, ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ శారీరక వైకల్యానికి ప్రభుత్వాలదే బాధ్యత అని అన్నారు. న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది వైకల్యమున్న పిల్లలకు ఏడు స్కూళ్లు మాత్రమే ఉన్నాయంటే వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. 2015-16 బడ్జెట్లో వికలాంగులకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నవనిర్మాణ వేదిక గౌరవాధ్యక్షులు మురళీధర్‌గుప్తా, అధ్యక్షులు నల్లగంటి రామకృష్ణ, ప్రధానకార్యదర్శి సిలివేరి వెంకటేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. -
11నుంచి అంధుల జాతీయ సదస్సు
అఖిల భారత కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ (ఢిల్లీ) జాతీయ సేవా సంస్థ ప్రతి నాలుగేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సర్వసభ్య సమావేశాలను ఈనెల 11 నుంచి రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో విద్యాహక్కు, విద్యా విషయ చట్టం అమలు సమస్యలపై చర్చించనున్నట్లు నిర్వహాకులు అంధుల అభివృద్ధి, సంక్షేమ సంఘం(డ్వాబ్) ప్రధాన కార్యదర్శి సోమగోటి చొక్కారావు(నల్లగొండ) తెలిపారు. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ సంస్థకు దేశవ్యాప్తంగా 20 అనుబంధ సంస్థలు ఉన్నాయని, దాదాపు 150 మంది కార్యక్రమంలో పాల్గొంటారని చొక్కారావు తెలిపారు. క్రిష్టోఫెల్ అండ్ బ్లైండ్ మిషన్ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తెలంగాణ సాగు నీటి పారుదల మంత్రి టి. హరీష్‌రావు పాల్గొంటారు. -
‘ఆరా’మ్గా చేస్తున్నారు..
ఫీజు దోపిడీపై స్కూళ్లలో నత్తనడకన తనిఖీలు లోపించిన శాస్త్రీయత, పారదర్శకత కంటితుడుపు చర్యేనని ఆరోపణలు సిటీబ్యూరో: అడ్డూ అదుపూ.. లెక్కాపత్రం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలు అటకెక్కాయి. తనిఖీలు కంటితుడుపు చర్యలేనన్న భావన అందరిలో కలుగుతోంది. తనిఖీలు ప్రారంభమై.. 25 రోజులు ముగిసినా ఇంకా కొలిక్కి రాలేదు. తీవ్ర ఒత్తిడులు ఎదురవుతుండడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు, విద్యా హక్కు చట్టాన్ని కాలరాసి.. విద్యార్థుల నుంచి కాసులు పిండుకుంటున్నాయి. ఎటువంటి శాస్త్రీయత పాటించకుండా ఏటికేడు ఫీజుల మొత్తాన్ని పెంచుతూ.. వసూలు చే స్తున్నారు. ఈ తతంగంపై ఇప్పటికే ‘సాక్షి’తో సహా పలు పత్రికలు విస్తృతంగా కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దోపిడీ విషయాన్ని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రతిగా అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని హెచ్చరించింది. చివరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకుని.. స్కూళ్లలో తనిఖీల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి విద్యాశాఖ ఇన్చార్జి హైదరాబాద్ రీజినల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌తోపాటు ఇద్దరు ఆడిటర్లు కమిటీలో సభ్యులు. మొదట నమూనాగా గుర్తించిన పది స్కూళ్ల గుర్తింపు, ఫీజుల వసూలు, బ్యాలెన్స్ షీట్, ఆదాయం, వ్యయం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులు లోతుగా తనిఖీలు చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది. అతీగతీ లేని వైనం.. గత నెల 17వ తేదీన తనిఖీలు మొదలు పెట్టారు. వాస్తవంగా రోజుకో స్కూల్ చొప్పున ఎంచుకుని.. ఈ ప్రక్రియ ముగిస్తామని, ఈనెల 10వ తేదీకల్లా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తామని కమిటీ సభ్యులు, జంట జిల్లాల డీఈఓలు మొదట్లో పేర్కొన్నారు. నిర్దేశిత గడువు మూడు రోజుల క్రితమే ముగిసింది. ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లలో తనిఖీలు పూర్తయ్యాయో అధికారులకే తెలియకపోవడం గమనార్హం. కమిటీలో సభ్యులుగా ఉన్న జంట జిల్లాల డీఈఓలు సైతం చెప్పలేకపోతున్నారు. దీంతో నివేదిక అందజేతపై స్పష్టత కొరవడింది. మొన్నటి వరకు హైదరాబాద్ ఇన్చార్జి ఆర్జేడీగా ఉన్న సుధాకర్ స్థానంలో... ఇటీవల రెగ్యులర్ ఆర్జేడీగా కృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మార్పు కూడా తనిఖీలపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన ఆర్జేడీ పూర్తిస్థాయిలో తనిఖీలపై దృష్టి సారించాల్సి ఉంది. కనిపించని పారదర్శకత .. తనిఖీలు పారదర్శకంగా, పూర్తిస్థాయిలో జరగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు వెళ్లిన ఆడిటర్లకు పూర్తి వివరాలు అందజేయడంలో స్కూళ్ల యాజమాన్యాలు వెనుకంజ వేస్తున్నాయి. ఒక్కో స్కూల్లో పది తరగతులు ఉంటే.. కింది స్థాయిలో రెండు లేదా మూడు, పైస్థాయిలో రెండు తరగతులకు సంబంధించిన ఫీజు వివరాలను మాత్రమే చూపుతున్నారని తెలిసింది. ఈ విషయంపై ఆడిటర్లు సైతం యాజమాన్యాలను ప్రశ్నించలేకపోతున్నారు. తనిఖీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతేగాక ఒక స్కూల్లో 2001లో చేరి ప్రస్తుతం ఐదో తరగతికి చదువుతున్న విద్యార్థికి ఒక ఫీజు, అదే తరగతిలో ఈ ఏడాది చేరిన విద్యార్థి నుంచి మరొక ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాల మధ్య భారీ తేడా ఉన్నట్లు ఆడిటర్లు గుర్తించారు.