న్యూఢిల్లీ: విద్యాహక్కు చట్టం కింద అన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలు, వ్యాయామ శిక్షకుడి సేవలను తప్పనిసరి చేశామని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. ఆటలు, ఇతర విద్యేతర కార్యక్రమాలకు సీబీఎస్‌ఈ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రాల బోర్డులు కూడా ఈ మార్గాన్ని అనునసరించాలని క్రీడల మంత్రి విజయ్ గోయల్ కోరారు.
దేశంలో క్రీడల అభివద్ధికి ప్రభుత్వం ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించదని తెలిపారు. దీని కింద దేశవ్యాప్తంగా వివిధ అంచెల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.క్రీడల ప్రోత్సాహకానికి మెరుగైన వసతులు, మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి అన్నారు.
పాఠశాల్లో మైదానాలు తప్పనిసరి: కేంద్రం
Published Fri, Dec 2 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
Advertisement