అఖిల భారత కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ (ఢిల్లీ) జాతీయ సేవా సంస్థ ప్రతి నాలుగేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సర్వసభ్య సమావేశాలను ఈనెల 11 నుంచి రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో విద్యాహక్కు, విద్యా విషయ చట్టం అమలు సమస్యలపై చర్చించనున్నట్లు నిర్వహాకులు అంధుల అభివృద్ధి, సంక్షేమ సంఘం(డ్వాబ్) ప్రధాన కార్యదర్శి సోమగోటి చొక్కారావు(నల్లగొండ) తెలిపారు.
ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ సంస్థకు దేశవ్యాప్తంగా 20 అనుబంధ సంస్థలు ఉన్నాయని, దాదాపు 150 మంది కార్యక్రమంలో పాల్గొంటారని చొక్కారావు తెలిపారు. క్రిష్టోఫెల్ అండ్ బ్లైండ్ మిషన్ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తెలంగాణ సాగు నీటి పారుదల మంత్రి టి. హరీష్‌రావు పాల్గొంటారు.